Nov 01,2023 23:40

ప్రజాశక్తి - కిర్లంపూడి, జగ్గంపేట రూరల్‌ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థ నడుస్తోందని రాష్ట్ర హోమ్‌ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం కిర్లంపూడిలో నూతనంగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం మంత్రి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న పోలీస్‌ వ్యవస్థను మెరుగు పరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నారన్నారు. నిన్నటి వరకూ కుట్రపూరితంగా చంద్రబాబును అరెస్ట్‌ చేశారని, ఈ రోజు న్యాయం గెలిచిందని అంటున్నారని, కేసులో గ్రావీటి ఉంది కాబట్టే ఇన్ని రోజులు చంద్రబాబు జైలులో ఉన్నారని చెప్పారు. ఆయన ఆరోగ్యం కోసం షరతులతో కూడిన బెయిల్‌పై మాత్రమే బయటకు వచ్చారని, ఆయనకు పూర్తీ రిలీఫ్‌ ఇవ్వలేదనే విషయాన్ని టిడిపి నాయకులు గ్రహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీత, జగ్గంపేట, రాజానగరం ఎంఎల్‌ఎలు జ్యోతుల చంటి బాబు, జక్కంపూడి రాజా, రుడా చైర్మన్‌ షర్మిల రెడ్డి, ఏలూరు రేంజ్‌ డిఐజి జివిజి.అశోక్‌ కుమార్‌, ఎస్‌ఫి ఎస్‌.సతీష్‌ కుమార్‌, ఎఎస్‌పిలు జి.ప్రేమ్‌కాజల్‌, పి.శ్రీనివాస్‌, బి.సత్యనారాయణ, డిఎస్‌పి కె.లతాకుమారి, ఎంపిపి తోట రవి, సర్పంచ్‌ మహేంద్రాడ శ్రీలత, సొసైటీ చైర్మన్‌ చదలవాడ బాబీ, మాజీ సర్పంచ్‌ పెంటకోట నాగబాబు పాల్గొన్నారు.