Jul 13,2023 17:29

ప్రభుత్వ లబ్ధిపతులను అందిస్తున్న ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి

రాష్ట్రంలో పథకాల పంట
: ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు

రాష్ట్రంలో వైసిపి పాలనలో పేదల ఇండ్లలో పథకాల పండగ నిండి ఇంటింటా ఆనందమయం అయిందని వైసిపి నియోజకవర్గ సీనియర్‌ నాయకులు ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని 22వ వార్డులో గాంధీ నగర్‌లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగనన్న సచివాలయ వలంటీర్‌ వ్యవస్థ లను ప్రారంభించి ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారన్నారు. అన్ని వార్డుల్లో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు వేగవం తంగా జరుగుతున్నాయని తెలిపారు. పట్టణంలోని అన్ని వార్డులను అభి వృద్ధి చేయాలనే సంకల్పంతో ఒక ప్రణాళిక మేరకు సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌, పార్టీ నాయకులు, చైర్మన్‌ లు, వైస్‌ చైర్మన్‌ లు, కౌన్సిలర్లు, ఇన్‌ ఛార్జ్‌ లు, మున్సిపల్‌ అధికారులు, కార్యకర్తలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.