ప్రజాశక్తి- మెరకముడిదాం : రాష్ట్రంలో ప్రతి పక్ష పార్టీ గాని, ప్రతి పక్ష నాయకుడు గాని లేరని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గురువారం మండలంలోని గర్భాం పంచాయతీలో సచివాలయం -1, రైతు భరోసా కేంద్రాలను ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సుమారు రూ.371 కోట్ల ప్రజాధనాన్ని అవినీతి చేసి చంద్రబాబు జైలు పాలయ్యారన్నారు. ఈ నాలుగున్నారేళ్ల కాలంలో వైసిపి ప్రభుత్వంలో గర్భాం పంచాయతీకి రూ.56కోట్లు సంక్షేమ పథకాలు అందించామన్నారు. గ్రామంలో 361 ఇల్లులు ఇచ్చామని, 1200 పింఛన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. రూ. 3.5కోట్లతో గ్రామంలో త్వరలో ఇంటింటికీ తాగునీటిని అందిస్తామన్నారు. ఈ సంక్షేమ పథకాలు అందాలన్న, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్నా మల్లి రాష్ట్రానికి జగన్ కావాలన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, సర్పంచ్ గాబ్రీలే, ఎస్‌వి రమణరాజు, సత్తారు జగన్ మోహనరావు, తాడ్డి చంద్రశేఖర్, బూర్లె నరేష్, పప్పల క్రిష్ణ మూర్తి, సత్తారు శ్రీను, వైస్ ఎంపిపి టి. హరిబాబు, జెసిఎస్ కన్వీనర్ ప్రసాద్ వైసిపి మండల అధ్యక్షులు కోట్ల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.