ప్రజాశక్తి-యంత్రాంగం రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రమాదంలో పడిందని పలువురు టిడిపి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం పలుచోట్ల పార్టీ ఆధ్వర్యాన నిరసన దీక్షలు చేపట్టారు. కాకినాడ రూరల్ రాష్ట్రంలో అన్ని రంగాల్లోనూ వైసిసి ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని టిడిపి సీనియర్ నేత చిక్కాల రామచంద్రరావు దుయ్యబట్టారు. చీడిగలో నులుకుర్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. ఈ దీక్షలో పెంకే శ్రీనివాస్ బాబా, పేరాబత్తుల రాజశేఖర్, నున్న దొరబాబు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రామదేవు సీతయ్య దొర, వాసిరెడ్డి ఏసుదాసు, గదుల సాయిబాబు, పితాని అప్పన్న, కాకరపల్లి చలపతి, యజ్జల బాబ్జి, కంచుమర్తి లావణ్య, ముమ్మిడివరపు సుబ్రహ్మణ్యం, ముగ్గుళ్ల బాబురావు, కొండా వినాయక్, దుర్గ భవాని, వెంకటలక్ష్మి, కొజ్జరపు ఉమా, రెడ్డి సుజాత పాల్గొన్నారు. వలస పాకలలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్య నారాయణ మూర్తి, మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంత లక్ష్మి నిరసన దీక్షలో పాల్గొన్నారు. అనంతరం 500 మందితో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు. తుని గొల్ల అప్పారావు సెంటర్‌లో అంబేద్కర్, ఎన్‌టిఆర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. చంద్రబాబు బాబుతో నేను కరపత్రాలను ప్రజలకు పంచారు. టిడిపి తుని ఇన్‌ఛార్జి యనమల దివ్య, యనమల కృష్ణుడు, దిబ్బ శ్రీను, లంక సునీల్, తాటిక సురేష్, పెనుపోతల నూకరాజు, పిల్లి బాబ్జి, బోడపాటి సత్యనారాయణ, పోల్నాటి శేషగిరిరావు పాల్గొన్నారు. పెద్దాపురం కట్టమూరులో చేపట్టిన దీక్షల్లో కాకినాడ రామారావు, ఎలిశెట్టి నాని, నిమ్మకాయల రంగనాగ్, పాలకుర్తి శ్రీనుబాబు, మేడిది శ్రీనివాస్, పచ్చిపాల సతీష్, నూనె రామారావు, అడపా గంగాధర్, గుత్తుల సూర్యవతి, ఉమామహేశ్వరి పాల్గొన్నారు.










