ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్రంలో ప్రజాస్వామ్యంతో సంబంధం లేని ప్రభుత్వం నడుస్తోందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. సోమవారం గాంధీ జయంతిని పురష్కరించుకుని స్థానిక అశోక్ బంగ్లా టిడిపి కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నగరంలోని మూడు లాంతర్లు జంక్షన్, రింగ్ రోడ్డు జంక్షన్, కనుకపరమేశ్వరి కోవెల జంక్షన్, మహిళా ప్రాంగణం, కలెక్టరేట్, గాంధీ పార్క్, కస్పా హై స్కూల్, ప్రేమ సమాజం, విటి అగ్రహారం తదితర ప్రాంతాల్లో మహాత్మా గాంధీ విగ్రహాలకు స్థానిక టిడిపి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్రమ అరెస్టుకునిరసనగా చంద్రబాబు, భువనేశ్వరి చేపట్టిన దీక్షకు మద్దతుగా తెలుగు మహిళలు అశోక్‌బంగ్లా వద్ద దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యంతో సంబంధం లేని ప్రభుత్వం రాష్ట్రంలో రావడంతో తమ నాయకుడిని కారణం లేకుండా అరెస్టు చేశారని అన్నారు. రాజ్యాంగం, చట్టాలు అమలు కావాలని, దౌర్జన్యాలు నశించాలని అన్నారు. మంత్రులు రాళ్లు విసురుతారు, చొక్కాలు విప్పుతారు, బూతులు మాట్లాడుతారు.. వారిపై ఒక కేసు కూడా ఉండదు, శాంతియుతంగా ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు అని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరీ టెంపుల్ దగ్గర గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చంద్రబాబు విడుదల కావాలని కన్యకా పరమేశ్వరీ టెంపుల్, అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం, చీపురుపల్లి కనక మహాలక్ష్మి దేవి ఆలయంలో పూజలు చేశారు.
నెల్లిమర్ల : నెల్లిమర్లలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కర్రోతు బంగార్రాజు, మాజీ ఎంపిపి సువ్వాడ వనజాక్షి ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. గాంధీజి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుల సువ్వాడ రవిశేఖర్, గేదెల రాజారావు, కడగల ఆనంద్, మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర్‌రావు, పతివాడ అప్పలనారాయణ, కర్రోతు సత్యనారాయణ పాల్గొన్నారు.
డెంకాడ: మండలంలోని జొన్నాడ జంక్షన్ వద్ద టిడిపి రిలే నిరాహారీ దీక్షలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర రావు, పతివాడ అప్పలనారాయణ, పల్లె భాస్కర్‌రావు, పతివాడ తమ్మినాయుడు, మహంతి శంకర్రావు, కలిదిండి పాణీరాజు, పతివాడ శివరామ విద్యా సాగర్ నాయుడు పాల్గొన్నారు.
కొత్తవలస : మండలంలోని దెందేరు గ్రామంలో టిడిపి ఆధ్వర్యాన నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి జనసేన నాయకులు మద్దతిచ్చారు.
బొబ్బిలి : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా చేపట్టిన దీక్షా శిబిరం వద్ద గాంధీకి టిడిపి నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. అనంతరం 20వ రోజు దీక్షలను టిడిపి సీనియర్ నాయకులు రౌతు రామమూర్తి ప్రారంభించారు. కోటలో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన దీక్ష చేపట్టారు. తనకు అనారోగ్యం కారణంగా కోటలో ఒంటరిగా దీక్ష చేసినట్లు బేబినాయన చెప్పారు.
వేపాడ : వేపాడ మండల కేంద్రంలో టిడిపి మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యాన రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మడి భారతి, బానాది ఎంపిటిసి గొంప తులసి, సేనాపతి గణేష్, ఎం.అప్పలసూరి, జి.నాగరాజు, సిరికి రమణ పాల్గొన్నారు.
బ్రాహ్మణికి గణపతినీడి సంఘీభావం
విజయనగరం కోట : రాజమండ్రిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ భార్య బ్రాహ్మణికి గణపతినీడి శ్రీనివాసరావు దంపతులు సోమవారం కలిసి సంఘీభావం తెలిపారు. విజయనగరం నుంచి 40 మంది మహిళలతో చంద్రబాబుకు మద్దతుగా రాజమండ్రికి బస్సు యాత్ర నిర్వహించారు. టిడిపి క్యాంప్ ఆఫీస్ వద్ద నారా బ్రాహ్మణిని కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించారు. కార్యక్రమంలో టిడిపి విజయనగరం పార్లమెంట్ అధ్యక్షురాలు కె.విమలా రాణి, తెలుగు మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి పత్తిగిల్లి సూర్యకుమారి, రాష్ట్ర క్రిష్టియన్ సెల్ కార్యదర్శి సిహెచ్ సుహాసిని, సోషల్ మీడియా రాష్ట్ర కో ఆర్డినేటర్ రెడ్డిపల్లి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.










