Oct 29,2023 21:48

కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు

         ప్రజాశక్తి-రాయదుర్గం   రాష్ట్రంలో న్యాయం, ధర్మాన్ని సమాధి చేసే కుట్ర జరుగుతోందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు తెలిపారు. 'జగన్‌కు కళ్లు తెరిపిద్దాం' పేరిట టిడిపి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని కాలవ నివాసం వద్ద తెలుగుతమ్ముళ్లు కళ్లకు నల్ల రిబ్బన్లతో గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. కాలవ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ నాయకత్వంలో చీకటి పాలన కొనసాగుతోందని, ఆయన న్యాయవ్యవస్థను నాశనం చేస్తూ, సమాధి కట్టేందుకు కుట్ర పన్నుతున్నట్లు ఆరోపించారు. చంద్రబాబును అరెస్టు చేసి 51 రోజులైనా ఇప్పటికీ కోర్టులో ఏ విషయం తేల్చలేదన్నారు. జగన్‌ న్యాయ వ్యవస్థను స్వార్థా నికి వాడుకుంటున్నారని, వాదనల పేరిట కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ము ను ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగరాజు, మహబూబ్‌బాషా, వెంకటేశులు, కౌన్సిలర్‌ ప్రశాంతి, భారతి, తిప్పయ్య, ప్రవీణ్‌, అంజి, జమీల్‌ఖాన్‌, కిరణ్‌, తిప్పేస్వామి పాల్గొన్నారు.