Oct 02,2023 21:28

గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం


గాంధీజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న దృశ్యం
రాష్ట్రంలో నియంత పాలన
ప్రజాశక్తి- నెల్లూరు సిటీ: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన బ్రిటీ సార్లను తలపిస్తుందని.. చివరికి మాట్లాడే స్వేచ్ఛను కూడా హరిస్తూ నియంత పాలన సాగిస్తుందని మాజీ మంత్రి పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లా టిడిపి కార్యాలయంలో చంద్రబాబు నాయుడుకి మద్దతుగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్న నేతలకు సోమవారం నిమ్మరసం ఇచ్చి ఆయన విరిమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ మార్గంలో టిడిపి నేతలంతా చంద్రబాబుకి మద్దతుగా దీక్షలు చేశారన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని మాట్లాడే స్వేచ్ఛ కూడా హరిస్తుందన్నారు.