Oct 19,2023 21:47

ప్రజాశక్తి - ఆచంట
           రాష్ట్రంలో సిఎం జగన్‌ కక్షపూరితమైన, అరాచక రాజకీయాలు చేస్తున్నారని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు అరెస్టుపై నిరసనగా ఆచంటలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారం 37వ రోజు కొనసాగాయి. ఈ దీక్షలను ఉద్దేశించి పితాని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి, నేతలు కేతా మీరయ్య, గొడవర్తి శ్రీరాములు, నరసింహమూర్తి ప్రసాద్‌, సత్యనారాయణ, చిలుకూరి శ్రీను, మన్నే తేజ భాస్కరరావు, మురళి, సీతారాం, రాజేష్‌, వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కాళ్ల : టిడిపిని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు అన్నారు. మండలంలోని పెదఅమిరం గ్రామంలో ఎంఎల్‌ఎ రామరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి రాంబాబు, బాబుతో నేను కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలుసుకోవడంతో పాటు మినీ మేనిఫెస్టోలోని పథకాల వివరాల ఉన్న కరపత్రాలను, అక్రమ అరెస్టు నేపథ్య వివరాలు ఉన్న కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు జివి.నాగేశ్వరరావు, కఠారి నరసింహరాజు, వేగశ్న మురళీకృష్ణంరాజు, కాలువ వెంకట్రావు, గండి నందిరాజు, పుప్పాల బుజ్జి, తోట ఫణిబాబు, మంతెన రామరాజు, సర్పం చులు మంతెన శ్రీనివాసరాజు, గేదల జాన్‌, మాజీ సర్పంచి వేణుగోపాలరావు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
వీరవాసరం : చంద్రబాబు అరెస్ట్‌ అన్యాయమని ఎంపిపి వీరవల్లి దుర్గాభవాని ఆవేదన వ్యక్తం చేశారు. బాబుతో మేము కార్యక్రమంలో భాగంగా గురువారం నవుడూరు సెంటర్‌లో గురువారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, వీరవల్లి చంద్రశేఖర్‌, జనసేన ఎంపిటిసి సభ్యులు యాల బండి ఇందిర, టిడిపి మండలాధ్యక్ష కార్యదర్శులు కొల్లేపల్లి శ్రీనివాసరావు, వీరవెల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పాలకొల్లు : చంద్రబాబు అరెస్టుపై నిరసనగా పాలకొల్లు పట్టణ తాపీ పని వర్కర్స్‌ యూనియన్‌ సారధ్యంలో గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం 37వ రోజు కొనసాగాయి. దీక్షలను ఉద్దేశించి ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు మాట్లాడారు.
మొగల్తూరు : చంద్రబాబు అరెస్టుపై నిరసనగా మండలంలోని ముత్యాలపల్లి గ్రామంలో టిడిపి నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాంబాబు, రేవు పాండు, రామారావు, కొల్లాటి పుల్లయ్య, సుందర సత్తిబాబు, కొల్లాటి సాయిబాబు, నాగేశ్వరరావు, పెంటయ్య పాల్గొన్నారు.