Feb 26,2023 20:22

సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న డా. డి. బాబన్‌

రాష్ట్రంలో దూదేకుల జనాభాను తేల్చాలి
రాజకీయ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలి
- దూదేకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.బాబన్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      రాష్ట్రంలో దూదేకుల కులస్తులు ఎంతమంది ఉన్నారో కులగణన ద్వారా లెక్క తేల్చాలని దూదేకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ డి.బాబన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నంద్యాలలోని నూనెపల్లి దగ్గర ఉన్న శ్రీనివాస హైస్కూల్లో నూరుబాష్‌, దూదేకుల సంఘం సభ్యుల సర్వసభ్య సమావేశం, నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఈ సమావేశానికి పట్టణ కార్యదర్శి డి.దస్తగిరి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డి.బాబన్‌ విచ్చేసి మాట్లాడారు. రాష్ట్రంలో నూర్‌, లడాప్‌ దూదేకుల కులస్తులు 15 లక్షల మంది ఉండగా ఐదు లక్షల మంది మాత్రమే ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయని, రాజకీయ పదవుల్లోనూ అవకాశాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దూదేకుల కులస్తులలో అనైఖ్యత వలననే అన్ని కోల్పోతున్నామన్నారు. మన హక్కులు హరించేటప్పుడు పోరాటమే మార్గంగా ఎంచుకొని ఉద్యమించాలన్నారు. నంద్యాల నుండే ఐక్యతకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్ర నాయకులు డాక్టర్‌ ఉమార్‌ (చమన్‌), డాక్టర్‌ మహమ్మద్‌, డాక్టర్‌ దస్తగిరి, యాలూరు హుస్సేన్‌, బుజ్జయ్య, నూర్‌ భాషా, క్రాంతి, వీరన్న, కౌన్సిలర్‌ జైనబి, డిడిఆర్‌ తదితరులు ఉపన్యాసించారు. అనంతరం నూతన కమిటీని రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ దస్తగిరి పర్ల ప్రకటించారు. అధ్యక్ష, కార్యదర్శులు వాసవీ స్కూల్‌ దస్తగిరి, ఆదాం సాహెబ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలుగా హుస్సేనప్ప, బాలు, కోశాధికారిగా సోమశేఖర్‌, ఉపాధ్యక్షులుగా సీడ్స్‌ బాబు, కన్నయ్య, జైనాబి, ఎల్‌ఐసి భాష, రైల్వే శంషావలి,సుభన్‌ భాషా, గోల్డ్‌ కాజా, సిద్ధార్థ, సహాయ కార్యదర్శిలుగా చిన్న రసూల్‌, నాగరాజు, గబ్బర్‌ దస్తగిరి, టీచర్స్‌ దస్తగిరి, ఫోటో మౌలాలి, సోక్రాభి, హుస్సేనమ్మ, టీచర్‌ యాసిన్‌, టీచర్‌ కన్నయ్య, కార్యవర్గ సభ్యులుగా డివైఎఫ్‌ఐ హుస్సేన్‌, దహిత హుస్సేన్‌, షేక్షావలి, టైలర్‌ మౌలాలి, ఎంపిటిసి హుస్సేన్‌, స్నాక్స్‌ హుస్సేన్‌, వైయస్సార్‌ నాగరాజు, షేక్‌ రఫీలను, సోషల్‌ మీడియా కన్వీనర్‌గా డిజిటల్‌ దస్తగిరి తదితరులు ఎన్నికయ్యారు. నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కమిటీ సభ్యుల సహకారంతో దూదేకుల సంఘం ఆధ్వర్యంలో విస్తృత సేవ కార్యక్రమాలు చేపడతామని, త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు.