
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :జగన్మోహన్ రెడ్డి పాలనలో వేల కోట్ల ప్రజా ధనం దోపిడీ అయిందని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి కార్యదర్శి, ఎంపిటిసి కొణతం రఘబాబు ఆరోపించారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు గురువారం మండలంలోని నరుకూరులో ''భవిష్యత్తుకు గ్యారంటీ- ఇది బాబు గ్యారంటీ'' కార్యక్రమం జరిగింది. రఘుబాబు వైసిపి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. వైసిపి నేతలకు ప్రజల సంక్షేమం కన్నా వారి వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమని రఘబాబు పేర్కొన్నారు. అనంతరం టిడిపి ప్రవేశపెట్టబోవుచున్న పధకాలు గురించి అయన వివరించారు. అర్హులను గుర్తించి వారిని టీడీపీ బిఓటీ యాప్ లో నమోదు చేసి లబ్ది చేకూర్చే వివరాలు రూపొందించిన బుక్లేట్ లను ప్రజలకు అందజేశారు. రానున్న ఎన్నికల్లో టిడిపిని ఆదరించలని కోరారు. బూత్ ఇంచార్జులు ఆరికాటి వెంకటేశ్వర్లు, ఆకుల జయకుమార్, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.