
మదనపల్లె అర్బన్ : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దుర్మార్గులు పాలకులు అయితే సన్మార్గులు జైలుకు వెళ్లాల్సి దుస్దితి వస్తుందని ప్రెంచ్ తత్వవేత్త ఫిడేల్ కాస్ట్రో చెప్పిన విధంగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరస్థులు పాలన సాగిస్తూ సన్మార్గులైన టిడిపి వారిని జైలు పాలు చేస్తున్నారని టిడిపి రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్‌జె.వెంకటేష్ పేర్కొ న్నారు. బుధవారం మదనపల్లె సబ్ జైలు వద్ద టిడిపి ముస్లిం మైనారిటీ నాయకులు, పోతబోలు పంచాయతీ మాజీ సర్పంచ్ పఠాన్ ఖాదర్ ఖాన్ 35 రోజుల పాటు సబ్ జైలులో వుండి విడుదలైన సందర్భంగా టిడిపి, జనసేన పార్టీల నాయకులు సురేంద్ర యాదవ్ రాందాస్ చౌదరి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేష్ ఆధ్వర్యంలో పఠాన్ ఖాదర్ ఖాన్ సబ్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా దుశ్శాలువతో సన్మానించి, పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. వెంకటేష్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం టిడిపి నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరాలు చేసిన వైసిపి వారు దర్జాగా బయట తిరుగుతూ చట్టాలను అపహాస్యం చేస్తున్నారనడానికి ఎమ్మెల్సీ అనంతబాబు, కడప ఎంపి లను ఉదహరించారు. ఎటువంటి నేరం చేయక పోయినా సన్మార్గులు జైలుపాలు అయ్యా రని, అవినీతి, ఆర్థిక నేరాలు చేసిన వారు పాలన చేస్తున్నారని అన్నారు. మీ ఆటలు ఎక్కువ రోజులు సాగవని హెచ్చరించారు. ప్రజలంతా జరుగుతున్న పరిమాణాలను గ్రహించాలని కోరారు. రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు.