
మాట్లాడుతున్న మాజీ మంత్రి నారాయణ
రాష్ట్రంలో అరాచక పాలన
-అభివద్ధిని ప్రశ్నిస్తే కేసులా..?
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ: వైసీపీ ప్రభుత్వంలో అభివద్ధి జాడేలేదని.. అయితే అరాచక పాలన సాగిస్తూ ప్రతిపక్షాలను, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయాందోళన సష్టిస్తున్నారని మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
నగరంలోని 6వ డివిజన్‌లో జీనిగలవారివీధిలో...బాబు ష్యూరిటీ - భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్ధుల్ అజీజులతో కలిసి మంగళవారం ఆయన పర్యటించారు.ఈ సందర్భంగా వారు గడప గడపకు వెళ్లి...వైసీపీ వైఫల్యాలను ప్రజలకి తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రానికి...చంద్రబాబు సిఎం అయితేనే... మీ భవిష్యత్ గ్యారెంటీ ఉంటుందని వివరించారు. అనంతరం మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందన్న విషయం...ప్రజలందరికి తెలుసుకున్నారన్నారు.ఎవరైనా అన్యాయాన్ని ప్రశ్నిస్తే... వారిని జగన్ ప్రభుత్వం భయపెట్టి...వారిపై అక్రమ కేసులు పెట్టించడం దుర్మార్గమన్నారు. అనంతరం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ... నెల్లూరు అభివద్ధి చెందాలంటే నారాయణ గెలవాలని స్పష్టం చేశారు.కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు షేక్ కరిముల్లా, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తాళ్లపాక అనురాధ, స్టేట్ కార్యదర్శి రాజా నాయుడు, కువ్వరపు బాలాజీ, ప్రశాంత్, కొండ ప్రవీణ్, అన్నపూర్ణ, వేణు పాల్గొన్నారు.