Sep 13,2023 22:04

విజయనగరంలో టిడిపి నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు
   చీపురుపల్లి : దీక్షలో మాట్లాడుతున్న కిమిడి నాగార్జున
 చీపురుపల్లి : దీక్షలో మాట్లాడుతున్న కిమిడి నాగార్జున

ప్రజాశక్తి-విజయనగరంకోట : రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని టిడిపి నాయకులు ధ్వజమెత్తారు. నిరసన తెలిపే హక్కును సైతం కాల రాస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టిడిపి నాయకులు బుధవారం విజయనగరం, పార్వతీపురం మన్యంజిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లోనూ రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. విజయనగరం, పార్వతీపురం, గజపతినగరంలో దీక్ష చేస్తున్న నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. బాబుకు తోడుగా ఒక నియంత పై పోరాటం కోసం మేము సైతం అంటూ ఈ దీక్షలను చేపట్టారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద నిరాహారదీక్ష సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా రాష్ట్రంలో లక్షల మంది యువతకు ఉపాధిని చూపించిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు ఈ నేపథ్యంలో శాంతియుతంగా నిరసన చేస్తున్న నాయకులను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించారు. ఈసందర్బంగా పోలీసులు నాయకులందరినీ ఈడ్చుకుపోయి వ్యాన్లలో ఎక్కించి టూ టౌన్‌ స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం వారందరినీ విడిచిపెట్టారు. అరెస్టు అయిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు విజయనగరం పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, కార్యదర్శి బంగారు బాబు, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, వి. ప్రసాద్‌, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. గరివిడి : చీపురుపల్లిలో చేపట్టిన నిరాహారదీక్షల్లో జయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ కక్షపూరిత, ఫ్యాక్షన్‌ మనస్తత్వం ఉన్న వ్యక్తి రాష్ట్రంలో పరిపాలన సాగించడం ప్రజలందరి దురదృష్టమని అన్నారు. నాలుగున్నరేళ్ల వైకాపా పాలనలో జగన్‌ చేసిన అభివృద్ధి ఏమైనా ఉందంటే.. విధ్వంసం, అల్లకల్లోలమేనని విమర్శించారు. రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. ప్రజల గొంతు నొక్కడమే జగన్‌ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. తమ అధినేత చంద్రబాబుపై ఒక కేసు తర్వాత మరో కేసు పెట్టి, బయటకు రానీయకుండా చేసి, పార్టీని బలహీనపర్చాలని చూస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే రామతీర్థం ఘటనను తెరపైకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోందన్నారు. రిలే నిరాహార దీక్షల్లో టిడిపి నాయకులు రౌతు కామునాయుడు, పైల బలరాం, సారిపాక సురేష్‌బాబు, తాడ్డి సన్యాసినాయుడు, కెంగువ ధనుంజయ; రౌతు నారాయణరావు, దన్నాన రామచంద్రుడు, దన్నాన సూరపునాయుడు, శనపతి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

   చీపురుపల్లి : దీక్షలో మాట్లాడుతున్న కిమిడి నాగార్జున

గజపతినగరంలో నియోజకవర్గ ఇంఛార్జి కెఎ నాయుడు ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దత్తిరాజేరు టిడిపి మండల అధ్యక్షులు పెద్దింటి మోహన్‌, నాయకులు, క్లస్టర్‌ ఇంఛార్జిలు బెజవాడ బంగారు నాయుడు, మజ్జి మహేష్‌, ఎస్‌సి సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు సీర రామారావు, మండల మహిళా అధ్యక్షులు గేదెల మంగమ్మ, పార్టీ నాయకులు కొండబాబు రాజు, మిత్తిరెడ్డి గౌరి నాయుడు, సాలాపు గౌరి నాయుడు, గేదెల రామసత్యం, తాడ్డి గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ జాతీయ రహదారి పక్కన రిలే నిరాహారదీక్ష చేపట్టగా అనుమతి లేదంటూ పోలీసులు దీక్షను భగం చేసి అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

   చీపురుపల్లి : దీక్షలో మాట్లాడుతున్న కిమిడి నాగార్జున

బొబ్బిలిలో చంద్రబాబుకు బెయిల్‌ రావాలని కోరుతూ బుధవారం శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన, కార్యకర్తలు పూజలు చేశారు. ఆలయం వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ, మండల అధ్యక్షులు రాంబార్కి శరత్‌, వి.సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దీనికి ముందు బేబినాయన ఆధ్వర్యంలో బొబ్బిలి కోటలో నిరాహారదీక్షలు చేపట్టారు.. నెల్లిమర్ల నియోజకవర్గం కేంద్రంలో టిడిపి ఇంచార్జి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో దీక్షలు చేశారు. అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిం చారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర రావు, సువ్వాడ వనజాక్షి, పతివాడ అప్పలనారాయణ, పతివాడ తమ్మినాయుడు, ఆకిరి ప్రసాద్‌ రావు, టిడిపి పూసపాటిరేగ, భోగాపురం మండల అధ్యక్షులు మహంతి శంకర్రావు, కర్రోతు సత్యనారాయణ, పతివాడ శివరామ విద్య సాగర్‌ నాయుడు, కలిదిండి పాణీరాజు, బైరెడ్డి లీలావతి, చిల్ల పద్మ, చింతపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మెంటాడ మండల కేంద్రలో టిడిపి నాయకులు నిరసన ర్యాలీ, అనంతరం మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో అరుకు పార్లమెంటు ఉపాధ్యక్షులు గెద్ద అన్నవరం, నాయకులు గొర్లె ముసలి నాయుడు, రెడ్డి రాజగోపాల్‌, రెడ్డి ఎర్రి నాయుడు, కుంటినవలస సర్పంచ్‌ రమేష్‌ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి సిరిపరపు గురునాయుడు, తాడ్డి తిరుపతి, రెడ్డి ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు. శృంగవరపుకోటలో దారగంగమ్మ ఫంక్షన్‌ హాల్లో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు బుధవారం రిలే నిరాహార దీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి వెంకన్న, కొనదం మల్లేశ్వరరావు, నానిగిరి రమణ, జిజి ఎస్‌ నాయుడు, చెక్క కిరణ్‌ కుమార్‌, కాపుగంటి వాసు, బర్మా కాలనీ సాయి, అనకాపల్లి చెల్లయ్య, పెదగాడ రాజు, కె ఈశ్వరరావు, రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదిర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ఆకుల డిపో వద్ద నియోజకవర్గ నాయకులు, మహిళలు, యువత, కార్యకర్తలతో కలసి రిలే నిరాహారదీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో లగుడు రవి కుమార్‌, గొంప వెంకటరావు, గొరపల్లి రాము, రాయవరపు చంద్రశేఖర్‌, పైడి బాబు, బండారు పెదబాబు, గుమ్మడి భారతి తదితరులు పాల్గొన్నారు.