Nov 18,2023 19:24

ఆదోనిలో నిరసన వ్యక్తం చేస్తున్న టిడిపి, జనసేన నాయకులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో వైసిపి నేతలకు కనిపించడం లేదా అని, జగన్‌ మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి చేయలేదని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, జనసేన ఇన్‌ఛార్జీ మల్లప్ప తెలిపారు. శనివారం మండలంలోని నాగనాథనహళ్లి, హోళగుంద రహదారి మధ్య గుంతలు ఉన్న రోడ్డుపై టిడిపి, జనసేన కార్యకర్తలు నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి 'నాలుగేళ్లలో గుంత కూడా పూడ్చలేని వైసిపి ప్రభుత్వం.. సిగ్గు, సిగ్గు' అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపై పడిన గుంతలను చూపిస్తూ వైసిపి ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్‌ విసిరారు. టిడిపి నాయకులు రంగన్న, రామస్వామి, తిమ్మప్ప, రంగస్వామి నాయుడు, మైనార్టీ నాయకులు అప్సర్‌ బాష, మండల నాయకులు బసవరాజు, బసాపురం వెంకటేష్‌ చౌదరి, జనసేన నాయకులు రమేష్‌ యాదవ్‌, రాజశేఖర్‌, నాగరాజు, వెంకటేష్‌ పాల్గొన్నారు. మంత్రాలయం మండలంలోని సూగూరు, బూదూరు గ్రామాలకు వెళ్లే రోడ్లపై టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్‌ రెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జీ బి.లక్ష్మన్న ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలుగు రైతు జిల్లా కార్యదర్శి బూదూరు మల్లికార్జున రెడ్డి, ఎల్లారెడ్డి, భాస్కర్‌ రెడ్డి, విజయరామిరెడ్డి, తిక్కస్వామి, నాగరాజు, రాగన్న, రవి, సుజ్ఞానం, ఇజ్రాయేల్‌, జనసేన నాయకులు ఏసోబు, ప్రవీణ్‌, బిబిసి.చిన్న, బి.రవిచంద్ర పాల్గొన్నారు. దేవనకొండలో టిడిపి ఇన్‌ఛార్జీ కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు టిడిపి మండల కన్వీనర్‌ విజయభాస్కర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో టిడిపి, జనసేన ఆధ్వర్యంలో రోడ్ల దుస్థితిపై నిరసన చేపట్టారు. టిడిపి నాయకులు బడి గింజల రంగన్న, ఉచ్చీరప్ప, మాలిక్‌, వీరేష్‌, మల్లయ్య, డీలర్‌ బండ్లయ్య, మాల బండ్లయ్య, మస్తాన్‌, తెలుగు యువత నాయకులు రాజా సాహెబ్‌, ఖాసీం, రాజశేఖర్‌ గౌడ్‌, చాంద్‌బాష, జనసేన నాయకులు మక్బుల్‌, మహానంది, ఆంథోని, రామలక్ష్మణ్‌, వీరేష్‌ పాల్గొన్నారు.

మంత్రాలయంలో నిరసన చేపడుతున్న నాయకులు
మంత్రాలయంలో నిరసన చేపడుతున్న నాయకులు