Apr 28,2023 00:29

రోడ్డును చూపుతున్న రామా నాయుడు

ప్రజాశక్తి-మాడుగుల: రాష్ట్రంలో అభివృధ్ధి శూన్యమని, అప్పుల్లో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు తెలిపారు. తొలుత ఘాట్‌ రోడ్‌ జంక్షన్‌ వడ్డాది ప్రధాన రహదారి దుస్థితి పై సెల్ఫీ చాలెంజ్‌ ఫోటో దిగిన ఆయన, మాడుగులలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జగన్‌ కు, ఆ పార్టీ వారికి మాత్రమే తప్ప ప్రజలకు ఎటువంటి భవిష్యత్తు లేదని తెలిపారు. కేసుల నుండి తప్పించుకునే వ్యవహారం తప్ప ప్రజల కోసం పని చేస్తుంది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో దుర్మార్గ పరిపాలన నడుస్తుందని, రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నాలుగేళ్ల పరిపాలనలో మాడుగుల నియోజక వర్గంలో ప్రధాన రహదారులు నరకాన్ని తలపి స్తున్నాయన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులు కను మరుగై పోయాయని విమర్శించారు. తెలుగుదేశం హయాంలో తాచేరు రిజర్వాయర్‌కు రూ.7.50 కోట్లు, వురకగెడ్డ రిజర్వాయర్‌కు రూ.8.50 కోట్లు, పెద్డేరు ఎడమ కాలువకు 6 కోట్లు మంజూరు చేశామని, కొత్తగా అధికారం చేపట్టిన వైసిపి ప్రభుత్వం ఆయా పనులు ఎందుకు ప్రారంభించ లేదని ప్రశ్నించారు. పెద్ద యెత్తున ఇసుక దందా నడుస్తుందని, తారువ వంతెన వద్ద ఇసుక తవ్వకాల కారణంగా పిల్లర్లకు ప్రమాదం వాటిల్లిందన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేదని, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పెన్ష్‌నర్‌లకు సకాలంలో జీతాలు, పింఛన్లు సైతం ఇవ్వడం లేదని తెలిపారు. అమరావతి ప్రాంతాన్ని మోసం చేశారని, అభివృద్ధి శూన్యం కాగా, నేతల సెటిల్‌ మెంట్లతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. ఎల్‌.పోన్నవోలు ప్రాంతంలో భారీ భూ కుంభకోణం జరిగిందన్నారు. బలవంతంగా ఇంటింటికి స్టిక్కర్లు అతికిస్తున్నారని విమర్శించారు.చేసిన పనులకు డబ్బులు రాక ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చివరికి వైపిసి సర్పంచులే తీవ్ర అసంతప్తితో ఉన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు రంజిత్‌ వర్మ, పంతులు మూర్తి కొట్నాల త్రినాథ్‌, గండి గోవిందు, ఢిల్లీ నానాజీ, మరువాడ ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.