ప్రజాశక్తి - చాట్రాయి
మాజీ ఎంఎల్‌ఎ చిన్నం రామకోటయ్య మరోసారి నూజివీడు నియోజకవర్గం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ ఆదివారం చాట్రాయి మండలం జనార్థన వరం, ఆరుగొలను పేట గ్రామ ప్రజలకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉన్నదన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి చెందాలంటే అధికార మార్పిడి ఒకటే మార్గం అని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయటం ఒకటే పరిష్కార మార్గం అన్నారు. ప్రజా మద్దతును తెలపాలని రెండు గ్రామాల ప్రజలకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.










