Sep 25,2023 21:07

నిరసన దీక్షల్లో టిడిపి నాయకులు

ప్రజాశక్తి - రాయచోటి : రాష్ట్రానికి పట్టిన శని జగన్‌ మోహన్‌ రెడ్డి, అని సైకోల నుంచి త్వరలోనే రాష్ట్రానికి విముక్తి లభించనుందని మాజీ ఎమ్మెల్యే టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆర్‌.రమేష్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్షలు 14 వ రోజు చేరుకున్నాయి. వికలాంగులు రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ వైసిపి నాయకులు తాత్కాలికంగా పైచేయి సాధించామని, సాధిస్తున్నామని సంబరపడొచ్చని కానీ అంతిమ విజయం ఎప్పుడూ ధర్మానిదే అని చెప్పారు. జగన్‌ మోహన్‌ రెడ్డి వల్ల రాష్ట్రం దారిద్య్ర దిగువ రేఖన ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరి తల పై రూ. 2 లక్షల 16 వేలు రూపాయలు అప్పు ఉందని పేర్కొన్నారు. మచ్చ లేని నాయకుడు చంద్ర బాబు నాయుడుపై తప్పుడు కేసులు బనాయించడం జగన్‌ మోహన్‌ రెడ్డి దుచ్చర్యకు నిదర్శనం అన్నారు.చంద్రబాబు నాయుడు చేసిన తప్పేంటి నైపుణ్య శిక్షణ కేంద్రాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు కల్పించడం నేరమా అని ప్రశ్నించారు. తన కుటుంబం కన్నా రాష్ట్ర ప్రజలే ముఖ్యమని రోజుకు 18 గంటలు నిరంతర శ్రామికుడుగా పని చేసిన ఏకైక నాయకుడు చంద్ర బాబు నాయుడు అన్నారు.