Oct 10,2023 19:47

ఆదోనిలో దీక్ష శిబిరానికి తరలి వస్తున్న మీనాక్షి నాయుడు, ఉమాపతి నాయుడు

ప్రజాశక్తి - మంత్రాలయం
రాష్ట్రానికి పట్టిన 'జగన్‌' అనే దరిద్రాన్ని ఓటు హక్కుతో తరిమికొట్టాలని టిడిపి ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి ప్రజలను కోరారు. మంగళవారం చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా స్థానిక రాఘవేంద్ర సర్కిల్‌లో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్‌ రెడ్డి అధ్యక్షతన 31వ రోజు సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాల్లేక, పంటలు పండక ప్రజలు వలసలు పోతున్నారని తెలిపారు. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి పట్టడం లేదన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి భూ కబ్జాలు మానుకోవాలని, భూ తగాదాలను సామరస్యంగా పరిష్కరించి కుటుంబాలకు అండగా ఉండాలని హితవు పలికారు. రానున్న రోజుల్లో టిడిపిదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు యువత జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పన్నగ నాగశయన స్వామి, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంత్‌ రెడ్డి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్‌, తెలుగు రైతు జిల్లా కార్యదర్శి బూదూరు మల్లికార్జున రెడ్డి, గోపాల్‌ రెడ్డి, పెద్దకడబూరు మండల కన్వీనర్‌ బసలదొడ్డి ఈరన్న, కోసిగి మండల కన్వీనర్‌ జ్ఞానేష్‌, బీసీ సీనియర్‌ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరద్వాజ్‌ శెట్టి, అశోక్‌ రెడ్డి, క్లస్టర్‌- 5 ఇన్‌ఛార్జీ కృష్ణా రెడ్డి, చిన్నభూంపల్లి నరసింహులు, ఉసేని, ఐరన్‌గల్‌ శివ, రామచంద్ర, పెద్దభూంపల్లి జనార్ధన్‌, ఆంజనేయులు, రామకృష్ణ, బెళగల్‌ ప్రభాకర్‌ రెడ్డి, సర్పంచి రామయ్య, గుండేష్‌, ఉసేని, రంగారెడ్డి, గోపాల్‌, నర్సిరెడ్డి, రామాంజినేయులు, సజ్జలగుడ్డం నరసింహులు, మాజీ సర్పంచి మల్లికార్జున, బసవరాజు, జంపాపురం నర్సిరెడ్డి, పల్లెపాడు మాజీ సర్పంచి చంద్ర, నర్సయ్య, పెద్దలక్ష్మన్న, చింతకుంట అంపయ్య, మారెయ్య, గవిగట్టు ఈరయ్య, గుడాల ఈరయ్య, వగరూరు అబ్దుల్‌, గోపాల్‌, ఉలిగయ్య, ఎస్సీ సెల్‌ నాయకులు మారెప్ప, యోబు, రాజు, ఐ టిడిపి సల్మాన్‌ రాజు, నీలకంఠ, హనుమంతు, బసవరాజు పాల్గొన్నారు. సామూహిక రిలే నిరాహార దీక్షకు కర్ణాటక భక్తులు సంఘీభావం తెలిపారు. రాఘవేంద్రస్వామి దర్శనార్థమై వచ్చిన కర్ణాటక రాష్ట్రం నంజనగూడకు చెందిన యువకుడు ప్రదీప్‌తో కలిసి ముగ్గురు సంఘీభావం తెలిపారు. అలాగే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టారని కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. రాఘవేంద్ర సర్కిల్‌ నుంచి శ్రీమఠం ప్రధాన ఆర్చి వరకు తెలుగు యువత జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి పన్నగ నాగశయన స్వామి ఆధ్వర్యంలో కరపత్రాలను పంచారు. ఆదోనిలోని ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద టిడిపి ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బాబు కోసం మేము సైతమంటూ క్లస్టర్‌ సభ్యులు హనవాళ్‌ మాబాష, పెద్దహరివాణం బసవరాజు, దొడ్డనకేరి వీరేంద్ర, సలకలకొండ ప్రతాప్‌ రెడ్డి, అంజి, రవి, సాధుల్లా, లక్ష్మీనారాయణ, సజ్జాద్‌, ఈరన్న సంఘీభావంగా దీక్షల్లో కూర్చున్నారు. వైసిపి ప్రభుత్వంలో నీరు, నిధులు, నియామకాలు గాలికి వదిలేశారని విమర్శించారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేదే లేదన్నారు. టిడిపి సీనియర్‌ నాయకులు ఉమాపతి నాయుడు, టిడిపి నాయకులు రామస్వామి, అప్సర్‌ బాష, అల్తాఫ్‌, ఇంతియాజ్‌, రంగస్వామి నాయుడు, శ్రీనివాస్‌ ఆచారి, అరెకల్‌ రామకృష్ణ, దొడ్డనకేరి శివప్ప, సోమనాథ్‌, అమర్‌, ప్రకాష్‌, కృష్ణారెడ్డి, లోకనాథ్‌ రెడ్డి, రంగన్న, విరుపాక్షి, వీరేష్‌, నాగరాజ్‌, ఎల్లప్ప, మల్లికార్జున, జగదీష్‌, జయ కుమార్‌, శేషారెడ్డి, సాదాపురం శేఖర్‌, అయ్యన్న, సుబ్బు ఉన్నారు. ఆదోని (రూరల్‌) మండలంలో గ్రామీణ ప్రాంతాల్లో 'డోర్‌ టు డోర్‌' కరపత్రాలు పంపిణీ చేస్తూ 'బాబుతో నేను' నిర్వహించారు. నాగలాపురం మాజీ సర్పంచి కురువ లింగన్న, టిడిపి సీనియర్‌ నాయకులు, వ్యవసాయ మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ మదిరే భాస్కర్‌ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, సౌదీ రావుఫ్‌ నిర్వహించారు. నాయకులు సాంబగల్‌ ఫక్రుద్దీన్‌, మాజీ కౌన్సిలర్‌ రామచంద్ర, సోమశేఖర్‌ రెడ్డి, నారాయణపురం షాషావలీ, మాజీ కౌన్సిలర్‌ మల్లికార్జున, ఇస్మాయిల్‌ బాష, రాముడు, సలకలకొండ శీను, మదిరే గోవిందు, షేకన్న, తిమ్మప్ప, పరమేష్‌, పకీరప్ప పాల్గొన్నారు. అలాగే టిడిపి మాజీ ఇన్‌ఛార్జీ గుడిసె కృష్ణమ్మ ఆధ్వర్యంలో పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు. పట్టణంలోని మంగళ ఆంజనేయస్వామి దేవాలయం లైన్‌లోని వివిధ షాపుల్లో సంతకాల సేకరణ చేపట్టారు. టిడిపి బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, బీసీ సెల్‌ రాష్ట్ర మాజీ కార్యదర్శి వడ్డేమాన్‌ గోపాల్‌, సాధిక్‌ వలీ, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు గుడిసె రామకృష్ణ, రాఘవరెడ్డి, వసీం, వెంకటప్ప గౌడ్‌, నాగిరెడ్డి, వేమన్న, రాము, వీరేష్‌, లక్ష్మీ కాంత్‌ రెడ్డి ఉన్నారు. నందవరంలోని తుంగభద్ర నదిలో 100 మందికి పైగా టిడిపి నాయకులు జలదీక్ష చేపట్టారు. మండలంలోని నాగలదిన్నె గ్రామంలో తుంగభద్ర నదిలో అర్ధ నగంగా దీక్ష చేశారు. సీనియర్‌ టిడిపి నాయకులు ఈరన్న గౌడ్‌, గురురాజ్‌ దేశాయి, నాగరాజ్‌ గౌడ్‌, ఖాసీం వలీ, టిడిపి కన్వీనర్‌ చిన్న రాముడు, నాయకులు గోపాల్‌, చంద్ర, రామకృష్ణా రెడ్డి, బాలరాజు, రామన్న గౌడ్‌, షరీఫ్‌, దావీదు, వీరేష్‌, మిట్టా సోమాపురం వీరేష్‌, ఆదిశేషు, ఈరన్న, ఉరుకుందు, కొండయ్య, నరసన్న, వలీ, ప్రభాకర్‌, తులసీరామ్‌ పాల్గొన్నారు.