ప్రజాశక్తి-వేటపాలెం: రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం తీవ్ర ద్రోహం చేస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య విమర్శించారు. మంగళవారం వేట పాలెంలో సిపిఎం, సిపిఐ కేంద్రంలో బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విదానాలకు నిరసిస్తూ ప్రచారభేరి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హౌదా, పోలవ రానికి నిధులు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్ అంశాలపై బిజెపి చర్యలను ఎండగట్టారు. విభజన చట్టంలో పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ లు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆయువుపట్టు లాంటి విశాఖ ఉక్కును కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తోందన్నారు. బిజెపి చేస్తున్న ద్రోహాన్ని ప్రశ్నించకుండా మన రాష్ట్ర ప్రభుత్వం దాసోహమైందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపి దేశాన్ని కాపాడుకోవాని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు పోలీసులతో ఉద్యమాల అణిచివేతలకు పాల్పడుతున్నాయన్నారు. ప్రజలందరూ ప్రజా వ్యతిరేక విధానాలను నిరశించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల సిపిఎం కార్యదర్శి నలతోటి బాబురావు, సిపిఐ నాయకులు తన్నీరు శింగరకొండ, మేడా వెంకటరావు, బత్తుల శ్యామేలు, ఎ బాబురావు, హేతువాద సంఘం నాయకులు పల్లపోలు నాగమనోహర లోహియా, కృష్ణారెడ్డి, వలేటి రాజశేఖర్ పాల్గొన్నారు.










