
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. వై ఎపి నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని గురువారం తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు ప్రారంభించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో 2019 జూన్ నుంచి 2023 జూన్ వరకూ చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు జగనన్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను స్థానిక యాగాలపల్లి వద్ద సెకండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని మంత్రి కొట్టు ఆవిష్కరించారు. ఆర్‌డిఒ కె.చెన్నయ్య పుష్పగుచ్ఛంతో మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ మాయ, మోసం, దగా, పచ్చి అబద్ధాలకు మారుపేరైన చంద్రబాబును జనం విశ్వసించడం లేదన్నారు. నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శామ్యూల్, కొలుకూరి ధర్మరాజు, కర్రి భాస్కరరావు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
మొగల్తూరు:పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. మొగల్తూరు పంచాయతీ పరిధి పడమటిపాలెం సచివాలయ ఆవరణలో గురువారం సాయంత్రం వై ఎపి నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో జరిగిన అభివద్ధి సంక్షేమ పథకాల డిజిటల్ బోర్డు ఆవిష్కరించినట్లు తెలిపారు. పథకాల అమల్లో నూరుశాతం పారదర్శకత పాటిస్తున్నామని, ఓట్ల కోసం కాదు అభివృద్ధి కోసం పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచి పడవల మేరీ సత్యనారాయణ, జెడ్‌పిటిసి తిరుమాని బాబ్జి వైస్ ఎంపిపి కైలా సుబ్బారావు, జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షులు అండ్రాజు చల్లారావు, ఎస్‌సి సెల్ జిల్లా అధ్యక్షులు కొల్లాబత్తుల రవికుమార్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉండి : 'రాష్ట్రానికి జగన్ ఎందుకు అవసరం' కార్యక్రమంలో భాగంగా ఉండి గాంధీనగర్ వీధిలో వైసిపి నాయకులు గురువారం సాయంత్రం ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉండి గ్రామ సర్పంచి కమతం సౌజన్య బెనర్జీ, ఎంపిపి ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని వెంటనే వాటికి పరిష్కారం చూపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే సచివాలయ అభివృద్ధికి రూ.20 లక్షలు కేటాయించి అభివృద్ధి పనులు పూర్తిస్థాయిలో చేయడం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తున్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి గొట్టుముక్కల కళ్యాణ్ వర్మ, మండల అధ్యక్షులు పెన్మత్స ఆంజనేయరాజు, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ గులిపల్లి అచ్చారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడిద వెంకటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.
వీరవాసరం : గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ గుర్తింపు పొందారని, అందుకే మరోసారి రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి కావాలని లబ్ధిదారులు తెలిపారు. ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి కార్యక్రమం గురువారం నందమూరి గరువులో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భీమవరం ఎఎంసి ఛైర్మన్ కోటిపల్లి బాబు, వ్యవసాయ సలహా మండలి ఛైౖర్మన్ గొలగాని సత్యనారాయణ, ఎంపిడిఒ జ్యోతి పాల్గొన్నారు.
ఆచంట : 'రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలి' కార్యక్రమంలో భాగంగా ఆచంట గ్రామ సచివాలయం వద్ద ఆచంట గ్రామ సర్పంచి కోట సరోజినీ వెంకటేశ్వరరావుచే గ్రామ సచివాలయ కార్యాలయం వద్ద మా నమ్మకం నువ్వే జగన్ డిజిటల్ బోర్డు ప్రారంభోత్సవం, జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు ఛైర్మన్ చిల్లే లావణ్య, వైసిపి మండల కన్వీనర్ జక్కంశెట్టి చంటి, సర్పంచి, సచివాలయ మండల కన్వీనర్ తమరాడ చంద్రశేఖర్, మండల బూత్ కన్వీనర్ కుక్కలా కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
నరసాపురం టౌన్ : రుస్తుంబాధ గ్రామ సచివాలయం వద్ద వైసిపి జగన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల డిజిటల్ బోర్డు, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అర్హులకు చేయూతనివ్వాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ అధికారులను నియమించి ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంబిసి ఛైర్మన్ పెండ్ర వీరన్న జెడ్‌పిటిసి బి.రాధాకృష్ణ, ఎంపిపి పాల్గొన్నారు.
పెనుమంట్ర:మన గ్రామానికి జగన్ సంక్షేమ పథకాలు అందించారో ప్రజలకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాల సమాచార బోర్డును ఆవిష్కరించినట్లు ఎంపిపి కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసు రెడ్డి) అన్నారు. గురువారం పొలమూరు సచివాలయం వద్ద సర్పంచి కాకర రాజేశ్వరరావు అధ్యక్షతన జగన్ సంక్షేమ పథకాల సమాచార బోర్డును ఎంపిపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట నారాయణ మాట్లాడుతూ గ్రామానికి 38 సంక్షేమ పథకాలకు రూ.25.95 కోట్లు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచి కలిదిండి దినేష్‌రాజు, వైఎస్ ఎంపిపి వాసంశెట్టి కిరణ్, వైసిపి మండల కన్వీనర్ గూడూరి దేవేంద్రుడు, వ్యవసాయ మండల కమిటీ ఛైర్మన్ కొవ్వూరి చిన్నారెడ్డి పాల్గొన్నారు.
పెనుగొండ : మండలంలో రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలని కార్యక్రమంలో భాగంగా వైసిపి నేతలు పార్టీ జెండాను ఎగరేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిన్నం రామారెడ్డి, తిక్‌రెడ్డి బాపిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. పాలకోడేరు: ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించాలని ఎంపిపి భూపతి రాజు సత్యనారాయణ రాజు (చంటి రాజు) అన్నారు. పాలకోడేరులో రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని ఎంపిపి చంటిరాజు గురువారం ప్రారంభించారు. పాలకోడేరు సచివాలయం-1 పరిధిలోని ప్రజలకు అందిన సంక్షేమ పథకాలకు సంబంధించిన బోర్డును ఎంపిపి చంటిరాజు ఆవిష్కరించారు. స్థానిక పురాణ దిమ్మ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వైసిపి జెండాను మండల కన్వీనర్ కటిక శ్రీదేవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఎంపిపి చంటిరాజు మాట్లాడారు. వచ్చేది ఎన్నికల కాలం నేపథ్యంలో ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. నియోజకవర్గంలో పివిఎల్ నరసింహరాజు పార్టీ అభివృద్ధి ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఎంపిడిఒ నాగేంద్రకుమార్, సర్పంచి ఇంజేటి మరియమ్మ లక్ష్మీపతి, ఉప సర్పంచి దెందుకూరి వెంకటరాజు పాల్గొన్నారు.