Nov 11,2023 19:43

గోడపత్రికను విడుదల చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి - గోనెగండ్ల
రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద పార్టీలను ఓడించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.ఆనంద్‌బాబు కోరారు. ఈనెల 15న విజయవాడలో నిర్వహిస్తున్న ప్రజారక్షణ భేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం గోడపత్రికను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన మతోన్మాద బిజెపి, దానికి కొమ్ముకాసే పార్టీలను ఓడించాలని కోరారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్బంధ విధానాలపై పోరాటాలకు ప్రజలు, ప్రజాతంత్ర, విద్యార్థి, కార్మిక నాయకులు కలిసి రావాలని తెలిపారు. ప్రజా సంఘాల నాయకులు కరుణాకర్‌, నరసింహులు పాల్గొన్నారు.