ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
రాష్ట్రాభివృద్ధికి టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణ చేస్తున్నట్లు, 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ.జయ నాగేశ్వర్‌రెడ్డి, టిడిపి నియోజకవర్గ పరిశీలకులు శ్రీరాములు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జీ రేఖ గౌడ్, జిల్లా నాయకులు చల్లా శ్రీవరుణ్ తెలిపారు. గురువారం మాచాని సోమప్ప మెమోరియల్ హాలులో నియోజకవర్గ టిడిపి, జనసేన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రానున్న రోజుల్లో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసి టిడిపి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను, జనసేన ప్రవేశ పెట్టిన షణ్ముఖ 5 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. అవినీతి, అరాచక పాలన కొనసాగిస్తున్న వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా డాక్టర్ బీవీ.జయనాగేశ్వర్‌రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. టిడిపి నాయకులు సుందర్ రాజు, కొండయ్య చౌదరి, కలీముల్లా, రంగస్వామి గౌడ్, మధుబాబు, మల్లికార్జున, డీలర్ మాబు, నాగరాజ్ గౌడ్, పుష్పవతి, గురురాజు దేశాయి, రాముడు, కాసీం వలీ, శ్రీధర్ నాయుడు, కృష్ణం నాయుడు, నజీర్ అహ్మద్, తిరుపతయ్య నాయుడు, అడ్వకేట్ చంద్రశేఖర్, అడ్వకేట్ చంద్రశేఖర్, మదీనా సాహెబ్, పార్లపల్లి మల్లికార్జున, అయ్యలప్ప, నాగరాజు, సోమేశ్వర్ రెడ్డి, వెంకటేష్, జనసేన నాయకులు మున్నా, నవీన్ కుమార్, మహబూబ్ బాషా, నాగరాజు పాల్గొన్నారు.