Apr 20,2023 20:02

కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి : ఎమ్మిగనూరు
రాష్ట్రాభివృద్ధి కాముకుడు టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, వయో భారాన్ని సైతం లెక్క చేయకుండా నవయువకుడిలా కాలంతో పోటీ పడి రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడే నాయకుడని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ.జయ నాగేశ్వర్‌ రెడ్డి కొనియాడారు. గురువారం టిడిపి కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భావితరాల భవిష్యత్తును ఆలోచించి వారికి భరోసా కల్పిస్తూ అడుగులు ముందుకు వేసే అపర భగీరథుడని తెలిపారు.
బ్లడ్‌ క్యాన్సర్‌ బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేత
నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన వేణుగోపాల్‌ రావు కుమార్తె కీర్తనా బాయి లుకేమియా క్యాన్సర్‌ (బ్లడ్‌ క్యాన్సర్‌)తో బాధపడుతున్నారని కుటుంబ సభ్యుల ద్వారా బీవీ తెలుసుకున్నారు. కీర్తనా బాయిని హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చేర్పించి తన మిత్రుడైన డాక్టర్‌ శ్రీనివాస్‌ (అమెరికా)ను ఒప్పించి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కీర్తనా బాయి చికిత్స కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం చేయించి చెక్కును టిడిపి నాగలదిన్నె గ్రామ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులకు అందజేశారు. టిడిపి నాయకులు మాధవరావు దేశాయి, గడ్డం నారాయణరెడ్డి, ఖాసీం వలీ పాల్గొన్నారు.