Jul 11,2023 21:55

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న టిడిపి నాయకులు

రాయచోటి : రాష్ట్ర అభివద్ధి చంద్రబాబు నాయుడుతోని సాధ్యమని మాజీ శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌, టిడిపి జతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్‌ కుమార్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం భవిష్యత్తు గ్యారెంటీ చైతన్య రథయాత్ర, రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. సంబేపల్లె మండలంలోని దేవపట్లలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాయచోటి పట్టణంలోని రవి హాల్‌ నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించి చెన్నముక్కపల్లెలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. రాష్ట్రం అభివద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో ఎన్నికల టిడిపి అధికారం రావడానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా పని చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యేలు రమేష్‌ కుమార్‌రెడ్డి, షాజహాన్‌, తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షులు నరసింహ యాదవ్‌, మాజీ టిటిడి బోర్డు మెంబర్‌ సుగవాసి ప్రసాద్‌ బాబు, టిడిపి నియోజకవర్గ నాయకులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, చంగల్‌ రాయుడు ప్రసంగించారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ఖాదర్‌బాషా, మాజీ జడ్‌పిటిసి నర్సారెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఖాదరవల్లి, కాలాడి ప్రభాకర్‌రెడ్డి, మన్నెర రామాంజనేయులు, బడిశెట్టిరవి, ఆంజనేయులురెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.