రాష్ట్ర వాల్మీకి/ బోయ కార్పొరేషన్ చైర్మన్‌గా పొగాకు రామచంద్ర ప్రమాణస్వీకారం
ప్రజాశక్తి -పెనుకొండ : విజయవాడ బిసి భవన్ లో బుధవారం మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి/ బోయ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా పెనుకొండకు చెందిన వైసిపి నాయకులు పొగాకు రామచంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా బీసీ కార్పొరేషన్ ఎమ్‌డి చంద్రశేఖర్ రాజు పొగాకు రామచంద్ర చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, వాల్మీకి సంఘం నేతలు పొగాకు రామచంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వాల్మీకి/ బోయ కార్పొరేషన్ చైర్మన్ గా పొగాకు రామచంద్ర రెండేళ్ల పాటు కొనసాగుతారు. ఈ కార్యక్రమంలో 56 బిసి కులాల కార్పొరేషన్ కోఆర్డినేటర్ ప్రవీణ్, వైసిపి నాయకులు కర్రా సంజీవరెడ్డి, గుడిపల్లి కళ్యాణ్, చంద్రగిరి వీర నారాయణరెడ్డి, పాదయాత్ర నటేష్, వెంకటగిరి పాల్యం హనుమంత రెడ్డి, చిన్నపరెడ్డిపల్లి శ్రీనివాస్ రెడ్డి, గుట్టూరు సురేష్, అమ్మవారి పల్లి ప్రసాద్ రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్లు కృష్ణ, గుంటూరు జిల్లాల వాల్మీకి నాయకులు, పెనుకొండ నియోజకవర్గానికి చెందిన వైసిపి నాయకులు పాల్గొన్నారు.










