Oct 16,2023 23:39

రాష్ట్ర టెన్నిస్‌ పోటీలకు విక్రమ్‌ అకాడమి విద్యార్థులు


రాష్ట్ర టెన్నిస్‌ పోటీలకు విక్రమ్‌ అకాడమి విద్యార్థులు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: రాష్ట్ర స్థాయి టెన్నిస్‌ పోటీలకు పట్టణంలోని విక్రమ్‌ స్పోర్ట్స్‌ అకాడమీ టెన్నిస్‌ విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్స్‌ గేమ్స్‌ లో భాగంగా తిరుపతిలో నిర్వహించిన అండర్‌-14, 17,19 బాల బాలికల విభాగాల్లో ఏకంగా 9 మంది ప్రతిభ చాటి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారు. అండర్‌-14(బాలురు) విభాగంలో జయ సాయి కుమార్‌, లీలా వినరు, గురు రోహిత్‌, అండర్‌-17(బాలురు) విభాగంలో కరుణ కుమార్‌, అబూబాకర్‌ సిద్దిక్‌, షేక్‌ ఉమర్‌ అక్మల్‌, అండర్‌-19(బాలురు) విభాగంలో యోగానంద, లీలా మహేష్‌, బాలికల విభాగంలో దేవకిలు ఉన్నారు. వీరంతా తిరుపతి జిల్లా జట్టు తరపున రాష్ట్ర స్థాయి టెన్నిస్‌ పోటీల్లో ఆడ నున్నారు. విక్ర మ్‌ స్పోర్ట్స్‌ అకాడమీ తరపు న అద్భుత ప్రదర్శ న చేసి రాష్ట్ర పోటీలకు ఎంపికైన క్రీడాకారులను ఆ అకాడమీ డైరెక్టర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ అభి నందించారు.