Sep 17,2023 01:22

ప్రజాశక్తి - రేపల్లె
ప్రజా సంక్షేమం, రాష్ట్ర సుస్థిరాభివృద్ధే లక్ష్యంగా సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని రాజ్యసభ అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం పోటుమెరక గ్రామంలో శనివారం నిర్వహించారు. ఇంటింటికీ పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చేసిన అభివృద్ది చెబుతూ ప్రజల సమస్యలు తెలుసుకుని సత్వరం పరిష్కరించేందుకు సిఎం జగన్‌ గడప గడపకు కార్యక్రమం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రతి ఇంట లబ్ది పొందినట్లు ప్రజలు విశేషంగా స్పందించారు. ఎన్నడూ లేనివిధంగా గ్రామంలో రూ. 9కోట్లకుపైగా లబ్ధిచేకూరిందని అన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని, రోడ్లు నిర్మించాలని ప్రజలు కోరారు. అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైసీపీ రూరల్ కన్వీనర్ గాదె వెంకయ్యబాబు, సర్పంచ్ కాగితాల హనుమ, నాయకులు గరికపాటి భానుకోటి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మండలి అంజయ్య పాల్గొన్నారు.