Nov 04,2023 20:54

నెల్లిమర్ల: రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులతో నిర్వాహుకులు

ప్రజాశక్తి- నెల్లిమర్ల : జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు 26 మంది ఎంపికైనట్లు కోచ్‌ చల్లా రాము తెలిపారు. శనివారం కొండవెలగాడలో జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలకు ఎంపికలు జరిగాయి. ఎంపికలో వివిధ కేటగరీలో 26 మంది ఎంపికైనట్లు తెలిపారు. కాగా ఈ నెల 17,18,19 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరగబోయే రాష్ట్ర స్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో వీరంతా పాల్గొంటారన్నారు. ఈ ఎంపికలో జిల్లా వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బి. లక్ష్మీ, కార్యదర్శి చల్లా రాము, పి.వెంకటేష్‌, బి. అశ్వని, ఆర్‌ ఎల్‌ గాయత్రి, కోచ్‌.ఎం.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
సాఫ్ట్‌ బాల్‌ జట్టుకు విద్యార్థులు ఎంపిక
బాడంగి: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నవంబర్‌ 10 నుండి12 వరకు బాపట్లలో జరగనున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్‌ బాల్‌ పోటీలకు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 9 మంది ఎంపికయ్యారని పీడీ గొర్లె బంగారునాయుడు తెలిపారు. శుక్రవారం విజయనగరం రాజీవ్‌ క్రీడా మైదానంలో జరిగిన జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో అండర్‌19 విభాగంలో ఎల్‌.అరుణ్‌ కుమార్‌, బి గోవింద్‌, డి.విష్ణువర్ధన్‌, ఎన్‌.స్వామినాయుడు, కె రోహిత్‌ కుమార్‌, ఎన్‌ కీర్తన, ఎన్‌.వరలక్ష్మి, టి ప్రియాంక, జి. వైదేహి ఎంపికయ్యారన్నారు. హెచ్‌ఎం మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి పాఠశాలకు జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికైన విద్యార్థులను అభినందించారు.
నేడు బాల్‌ బ్యాడ్మింటన్‌ ఎంపికలు
తెర్లాం: మండలంలోని నెమలాం జెడ్‌పిహెచ్‌ పాఠశాలలో ఆదివారం ఉదయం 9 గంటల నుండి బాల్‌ బ్యాడ్మింటన్‌ ఎంపిక పోటీలను నిర్వహించనున్నామని ఆ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.విజరుకుమార్‌, కార్యదర్శి శ్రీధర్‌, సుందరరావు,పీడీ సింహాచలం తెలిపారు. ఇక్కడ ఎంపికైన వారు డిసెంబర్‌ 8, 9, 10 తేదీల్లో అనంతపురంలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు వ్యాయామ ఉపాధ్యాయులు జి. సింహాచలం 9491568645ను సంప్రదించలని కోరారు.

నేషనల్‌ అథ్లెటిక్స్‌కు అశోక్‌
వంగర: ఈ నెల 7,8,9 తేదీల్లో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో జరగనున్న 38వ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీలకు స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థి దేవకివాడ అశోక్‌ ఎంపికయ్యాడని హెచ్‌ఎం ముద్దాడ రమణమ్మ శనివారం తెలిపారు. ఈ పోటీల్లో లాంగ్‌ జంప్‌ విభాగంలో అశోక్‌ పాల్గొంటారన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అభినందించారు.