
ప్రజాశక్తి - భట్టిప్రోలు
గుంటూరు జిల్లా వేజెండ్ల జెడ్‌పి ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన జిల్లాస్థాయి వాలీబాల్ జట్టులో సూర్యపల్లి విపి అండ్ జిఎస్ఎం ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని సిహెచ్ మాధవి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల హెచ్ఎం కె శ్రీనివాసశర్మ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేటి నుండి కడపలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో అండర్ 17విభాగంలో గుంటూరు జిల్లా జట్టలో మాధవి ఆడనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు విద్యార్థినితో పాటు పిఈటి జివిఎస్ నాగేశ్వరరావును అభినందించారు. స్కూల్ గేమ్స్ లో ఇప్పటికే వివిధ ఆటల పోటీలలో జిల్లాస్థాయిలో రాణించారని, రాష్ట్రస్థాయిలో కూడా మాధవి తన ప్రతిభను కనబరిచి జిల్లాకు గుర్తింపుని తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.