విద్యార్థులను అభినందిస్తున్న ఉపాధ్యాయులు
ప్రజాశక్తి- చీడికాడ:రాష్ట్ర స్థాయి త్రో బాల్ పోటీలకు తురువోలు, చుక్కపల్లి గ్రామాలకు చెందిన ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన త్రోబాల్ పోటీలలో ఎ.బాలాజీ, జి.ఈశ్వరరావులు, మజ్జి పవన్ కుమార్. యమున విద్యార్థులు విజేతలుగా నిలిచి ఎంపికయ్యారు. రాష్ట్ర పోటీలకు విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి, బి.కోటేశ్వరరావు, స్కూల్ కమిటీ చైర్మన్ ఎం.చిన్నమ్మలు, ఎం.వరహాల రావు అభినందించారు.










