Dec 26,2022 00:11

ఎంపికైన క్రీడాకారులతో కోచ్‌

ప్రజాశక్తి-ఎస్‌.రాయవరం:రాష్ట్రస్థాయి త్తెక్వాండో పోటీలకు అడ్డురోడ్డు క్రీడాకారులు ఎంపికయినట్లు కోచ్‌ రాంచరణ్‌ తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 23న శుక్రవారం మధురవాడ ద్రోణంరాజు కళ్యాణమండపంలో జరిగిన అండర్‌-14, అండర్‌ు17 సెలక్షన్లలో తిమ్మాపురం పంచాయతీ అడ్డురోడ్డు త్తెక్వాండో క్లబ్‌ కు చెందిన 16 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. ఇందులో పాల్గొన్న క్రీడాకారులు ఆరు బంగారు పతకాలు, ఐదు రజిత, మూడు కాంస్య పతకాలు సాధించారని కోచ్‌ రాంచరణ్‌ తెలియజేశారు. వీరందరూ ఈ నెల 27 నుండి 29 వరకు నంద్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి కాంపిటీషన్లో పాల్గొంటారని ఆయన తెలిపారు.