విద్యార్థిని అభినందిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి -పొదలకూరు :రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ (కడప)కు నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో నెల్లూరు జిల్లా నుంచి బాలుర విభాగంలో గుంటి లీలా గౌతమ్ ఎంపికయ్యారు. ఆ విద్యార్థి పట్టణంలోని అమరావతి పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. ఆ పాఠశాల కరెస్పాండంట్ కె.సురేష్ మాట్లాడుతూ తమ స్కూల్ నుండి లీలా గౌతమ్ ఒక్కడే ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థిని, తల్లిదండ్రులని పాఠశాలలో సన్మానించారు.ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










