ఎంపికైన విద్యార్థి (వృత్తంలో)
పార్వతీపురం రూరల్: కడప జిల్లా కేంద్రంగా ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో అండర్ 17 విభాగంలో ఉమ్మడి విజయనగరం జిల్లా జట్టుకు ప్రాధాన్యత వహించిన పార్వతీపురం మండలం డోకిశిలా గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రవీణ్ జట్టు బంగారు పతకం సాధించింది. జట్టులో విశేష ప్రతిభ కనబరిచిన ప్రవీణ్ కుమార్ ఆట తీరుకు రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు లభించాయి. సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థి ప్రవీణ్‌ను ప్రధాన ఉపాధ్యాయులు గోవిందరావు, పీడీ మంతెన వాసుదేవరావు, పిఇటి దుర్గాప్రసాద్, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.










