Nov 16,2023 19:42

ఎంపికైన విద్యార్థులు

ప్రజాశక్తి -కందుకూరు : కందుకూరు టి ఆర్‌ ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు కె అశ్వని పి మానస ఉమ్మడి ప్రకాశం జిల్లా హ్యాండ్‌ జూనియర్‌ బాలికల జట్టుకు ఒంగోలు లో జరిగిన సెలక్షన్లలో ఎంపికయ్యారు. వారు రాష్ట్ర స్థాయిలో ఏలూరు జిల్లాలో ఈనెల 19, 20 తేదీల్లో జరిగే క్రీడల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం రవి కుమార్‌, ఐక్యూఎసి కో ఆర్డినేటర్‌ పి రాజగోపాల్‌ కళాశాల పిడి కె.ఆర్‌. కరుణ కుమార్‌ విద్యార్థులను అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు.