Mar 30,2023 23:44

క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

ప్రజాశక్తి-పాడేరు:పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతర మహౌత్సవం సందర్బంగా 35 వ రాష్ట్ర స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి గురువారం ప్రారంభించారు. ముందుగా టోర్నీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్య్రమంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి. ట్రైకార్‌ చైర్మన్‌ సతక బల్లిబాబు, స్థానిక సర్పంచ్‌ కొ ట్టగుల్లి ఉషారాణి, సుబ్బారావు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుల్లి సింహాచలం నాయుడు,
ఎపి మెడికల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ తమర్భ నరసింగరావులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, బుల్లిబాబు, సర్పంచ్‌ పి దొర మాట్లాడారు. టోర్నీలో పాల్గొంటున్న క్రికెట్‌ జట్లను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బ్యాటింగ్‌ చేయగా చైర్మన్‌ బుల్లిబాబు బౌలిం చేసి చేసి టోర్నీని ప్రారంభించారు. సర్పంచ్‌ ఉషారాణి, పిన్నయ్య, సుబ్బారావు బ్యాటింగ్‌ చేసారు. టోర్నీ నిర్వాహకులు దుర్గారావు మాట్లాడుతూ, 75 టీంలు వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.కొండబాబు, యాదగిరి శ్రీను, ఉప్పల వెంకటరత్నం, కళాశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి, జిల్లా కల్చరల్‌ అధ్యక్షుడు దిలీప్‌, వైసీపీ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.