Nov 10,2023 23:52

చేబ్రోలు: రాష్ట్ర స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు నారాకోడూరు విద్యార్థులు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు ఎం ఏడు కొండలు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుండి 12 వరకు విజయవాడలోని పడమట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగే రాష్ట్ర స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ హ్యాండ్‌ బాల్‌ పోటీలలో 14 సంవత్సరాల లోపు బాల బాలికల హ్యాండ్‌ బాల్‌ టోర్నమెంట్‌ పోటీలలో పాల్గొన నున్నట్లు తెలిపారు.గుంటూరు జిల్లా జట్టు తరపున నారాకోడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యా ర్థులు 8 మంది బాలురు, ఇద్దరు బాలికలు పోటీలలో పాల్గొనేందుకు ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎంపికైన విద్యార్థులను అభినందించారు.