Nov 27,2022 21:19

ప్రజాశక్తి - టి.నరసాపురం
           రాష్ట్రస్థాయి చదరంగం పోటీలకు మండలంలోని కేతవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు పొదిల తులసీ రామ్‌, వెలగల నాగదుర్గ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాదిరాజు రామరాజు తెలిపారు. పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఆదివారం అభినందించారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన అత్తిలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అండర్‌-17 విభాగంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి చదరంగం పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచి విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఉత్తమ విద్యార్థులతో పాటు విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఫిజికల్‌ డైరెక్టర్‌ జి.రమేష్‌ను అభినందించారు. విద్యార్ధులను అబినందించిన వారిలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్‌ బర్రే రమేష్‌, ఉపాధ్యాయులు టి.కుమారి, నాగలక్ష్మి, ఏసురత్నం, పాషా, ఫణిశ్రీ, జార్జ్‌ పాల్గొన్నారు.