Sep 28,2023 22:42

ప్రజాశక్తి - నగరం
మండలంలోని శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థులు అండర్ 19విభాగంలో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అనగాని హరికృష్ణ  తెలిపారు. ఇటీవల బాపట్లలో నిర్వహించిన సెలెక్షన్స్ లో ఇంటర్మీడియట్ ఎంపిసి ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈహెచ్ఆర్ ఫణీంద్ర, సిహెచ్ గోపీకృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లా చదరంగం జుట్టుకు ఎంపికైనట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా చదరంగం జుట్టుకు ప్రాతినిధ్యం వహించినున్నట్లు తెలిపారు. పోటీలకు ఎంపికైన క్రీడాకారులను కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్యచౌదరి అభినందించారు. మరింత ఉత్తమ ప్రతిభ కనబర్చేలా కృషి చేయాలని కోరారు. కళాశాల తరపున వారికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉంటుందని తెలిపారు. శిక్షణ ఇచ్చి ప్రోత్సహించిన కళాశాల పిడి సాంబమూర్తిని కళాశాల ఎఒ సుధాకరరావు,  ప్రిన్సిపాల్ హరికృష్ణ అభినందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వెంకట నారాయణ,  కామేష్ పాల్గొన్నారు.