Mar 23,2023 20:21

బండలాగు పోటీలను ప్రారంభిస్తున్న గ్రామస్తులు షమిన్‌(సిఎం)

రాష్ట్ర స్థాయి బండలాగు పోటీల్లో
మొదటి స్థానంలో పంచాలింగాల వృషబాలు

ప్రజాశక్తి - పగిడ్యాల

ఉగాది పండుగను పురష్కరించుకొని మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బండలాగు పోటీల్లో పంచాలింగాల వృషభాలు మొదటి స్థానంలో నిలిచాయి. వైసిపి నాయకుడు నాగభూషి గౌడు ఆధ్వర్యంలో బండలాగు పోటీలను నందిట్కూరు మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రబ్బని, లక్ష్మాపురం గ్రామస్తులు షమిన్‌ (సిఎం)లు బుధవారం ప్రారంభించారు. ఈ పోటీలలో పంచాలింగాల గ్రామానికి చెందిన బైరపోగు వృషబాలు 4250 అడుగులు బండలాగి మొదటి స్థానంలో నిలిచాయి. గుట్టపాడు గ్రామానికి చెందిన వెంకటరామిరెడ్డి, పి రుద్రవరం గ్రామానికి చెందిన యల్లాగౌడు వృషబాలు 4127.8 అడుగులు బండ లాగి రెండవ స్థానంలో, ప్రకాశం జిల్లా నాగులపాడు గ్రామానికి చెందిన పుల్లకాయల శేషాద్రి చౌదరి వృషబాలు 4052 అడుగులు లాగి మూడవ స్థానంలో, రంగాపురం గ్రామానికి చెందిన చిన్నారెడ్డి వృషబాలు 3864 అడుగులు లాగి నాలుగోవ స్థానంలో, ఎ కోడురు గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డి వృషబాలు 3809 అడుగులు బండలాగి ఐదవ స్థానంలో నిలిచాయి. మల్ల్యాల గ్రామానికి చెందిన మైమున్నా వృషబాలు 3716 అడుగులు బండలాగి ఆరోవ స్థానంలో నిలవగా, బల్లవరం గ్రామానికి చెందిన శివ వృషబాలు 3274.3 అడుగులు బండలాగి ఏడవ స్థానంలో నిలిచాయి. మొదటి బహుమతి రూ 30 వేలు, రెండవ బహుమతి రూ 20 వేలు, మూడవ బహుమతి రూ 15 వేలు, నాలుగోవ బహుమతి రూ 10 వేలు, ఐదవ బహుమతి రూ 8 వేలు, ఆరోవ బహుమతి రూ 5వేలు, ఏడవ బహుమతి రూ 4 వేలు గెల్పుందిన వృషబాలకు బహుమతులు ప్రదానం చేశారు.