Oct 08,2023 00:42

రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక
ప్రజాశక్తి -తిరుచానూరు: తిరుచానూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో బాక్సింగ్‌ ఛాంపియన్‌ రాష్ట్ర స్థాయి జట్టును ఎంపిక చేశారు. అండర్‌ 14, అండర్‌ 17, అండర్‌ 19 బాల, బాలికల రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలకు ఎంపిక నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రధానోపాధ్యాయులు మురళి అధ్యక్షతన ప్రారంభోత్సవం జరిగింది. తిరుచానూరు సర్పంచ్‌ రామచంద్రా రెడ్డి భోజనం సదుపాయం కల్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా లోని వివిధ పాఠశాలల నుండి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. సాయంత్రం ఐదు గంటలకు ముగింపు సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్‌ శేఖర్‌ విచ్చేసి ఎంపికైన క్రీడాకారులకు మెడల్స్‌ ను బహుకరించారు. విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల మానసిక శారీరక వికాసానికి తోడ్పడతాయని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందిం చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ జి ఎఫ్‌ అధ్యక్షులు విజయ కుమారి కార్యదర్శి, బాబు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎస్‌ వెంకట ముని, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.