Oct 14,2023 17:58

మాట్లాడుతున్న కేవీపీఎస్ నాయకురాలు రంగమ్మ

రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
ప్రజాశక్తి - నందికొట్కూరు టౌన్

      దళిత సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ విధానాలతో దళిత సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారము నాడు కాకినాడలో జరుగు రాష్ట్ర దళిత సదస్సు ను జయప్రదం చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రంగమ్మ నందికొట్కూరు మండల కమిటీ సభ్యురాలు ఆర్ జయ రాణి  శనివారం నాడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దళితులపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని, మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నారని, ఇంతకాలం దళితులకు రక్షణగా ఉన్న చట్టాలు నీరుగారిస్తున్నారని స్వయంగా బిజెపి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ చట్టాన్ని నీరు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు బిజెపి ప్రభుత్వానికి అక్షింతలు వేసిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలకు పరిమితమైన దాడులు నేడు తెలుగు రాష్ట్రాలకు విస్తరించాయన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చే  ప్రయత్నంలో భాగంగా హిందువులకు 41 సి ఆర్ పి సి కింద బెయిల్ ఇప్పించే ఉత్తర్వులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పోరాడి సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు నవరత్నాలకు దారి మళ్ళించడం రాజ్యాంగ విరుద్ధమని, దళితులకు చెందిన భూములు పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. దీన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం రాష్ట్రస్థాయిలో ఆదివారం నాడు  కాకినాడలో సదస్సు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు.