
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఉమామహేవ్వరరావు
నవంబర్ 6న రాజమహేంద్రవరంలో సిపిఎం బహిరంగ సభ
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం రూరల్
రాష్ట్ర ప్రజల సర్వతోముఖావృద్ధి కోసమే సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా రక్షణభేరిని నిర్వహిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. సిపిఎం జిల్లా విస్తత సమావేశం. శుక్రవారం ధవళేశ్వరంలోని సిఐటియు కార్యాలయంలో బి.పవన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలు సొంత అజెండాల చుట్టూ తిరుగు తున్నాయన్నారు. వీటిని ప్రజా సమస్యల చుట్టూ మళ్లించే విధంగా పోరాడాలన్నారు. కులగణనను తాము స్వాగతిస్తామని, అయితే మంత్రి వేణుగోపాలకృష్ణ నవంబరు 15 నుంచి కులగణన చేస్తామని చేసిన ప్రకటన నాన్ సీరియస్‌గా ఉందన్నారు. ఎలాంటి చట్టబద్ధత గాని, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గాని లేదన్నారు. కులగణనను వాలంటీర్లతో చేయిస్తామని చెబుతున్నారని, దీనివల్ల కొత్త తగాదాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. రెవెన్యూ యంత్రాంగం ద్వారానే ఈ సర్వే జరగాలన్నారు. ఈ విషయం జాతీయస్థాయిలో వివాదాస్పదంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో సాంకేతికంగా, వివాదరహితంగా చేయాలన్నారు. అయితే ప్రభుత్వంలో అటువంటి చర్యలేవీ కనిపించట్లేదన్నారు. కేబినెట్ నిర్ణయం తీసుకుని ఒక పద్ధతి ప్రకారం చేయాలన్నారు. బిసిలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి కంటే వారి ఓట్లు గుంజుకోవాలనే తాపత్రయమే ఇందులో ఎక్కువగా కనిపిస్తోందన్నారు. అన్ని కులాల లెక్కలు వస్తే భవిష్యత్ చర్యలకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో దసరా పండగ సందర్భంలో రేషన్‌కార్డు దారులకు బియ్యం, పప్పులు, నూనె ఇచ్చేవారని, ఈ ఏడాది అదేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి వాటిని అందించాలని కోరారు. కరెంటు యూనిట్ రూపాయికే ఇవ్వడంతోపాటు పేదలకు 300 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని, స్మార్ట్‌మీటర్ల బిగింపు, ట్రూఅప్ ఛార్జీలను చేయాలని, రూ.400 గ్యాస్, రూ.60 లీటర్ పెట్రోలు, డీజిల్ ఇవ్వాలని,ఇ సుక ఉచితంగా ఇవ్వాలని, తలకు పదికేజీల ఉచిత బియ్యం, పప్పు నూనెల సరఫరా చేయాలన్నారు. నిత్యావసర ధరల తగ్గింపునకు చర్యలు తీసుకోవాలన్నారు. అన్నిరకాల పెన్షన్లు రూ.5వేలకు పెంచాలన్నారు. రెండు సెంట్ల స్థలం, రూ.5లక్షల ఆర్థిక సాయం అందించాలన్నారు. నివాసిత ప్రాంతాల్లోనే ఇళ్లకు పట్టాలివ్వాలన్నారు. కొత్తకాలనీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, చెత్తపన్ను, డ్రెయినేజీ ఛార్జీలు రద్దు చేయాలన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలన్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఆపాలన్నారు. అమరావతిలోనే రాజధాని ఉంచాలని, 40 వేల టీచర్‌పోస్టులకు మెగా డిఎస్‌సి ఇవ్వాలని, 2.50 లక్షల ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగబృతి నెలకు రూ.5వేలు ఇవ్వాలన్నారు. ఒపిఎస్‌ను పునరుద్ధరించాలన్నారు. ప్రయివేటు ఉపాధ్యాయులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పెన్షన్ ఇవ్వాలన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు రెండెకరాల భూమి ఇవ్వాలన్నారు. సేకరించిన భూముల్లో పరిశ్రమలు పెట్టాలని డిమాండ్ చేశారు. సలు పట్టాదారుకే అసైన్డ్ భూములపై హక్కులు ఇవ్వాలన్నారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు. 200 రోజులు ఉపాధి పనులు కల్పించాలన్నారు. కూలీలకు రూ.600వేతనం ఇవ్వాలన్నారు. ప్రయివేటు సంస్థలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. అసంఘటిత కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు. సమగ్ర సంక్షేమ చట్టం, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్. ప్రభుత్వ ఉద్యోగులుగా స్కీం వర్కర్లు గుర్తించాలన్నారు. అందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం, విద్యార్థులకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ కల్పించాలన్నారు. సుజాతారావు కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర. ప్రతి ఎకరాకు సాగునీరు, మోటార్లకు ఉచిత విద్యుత్, ప్రతి కౌలు రైతుకూ గుర్తింపు కార్డు, రుణం గ్యారంటీ, స్వామినాథన్, జయతీఘోష్, రాధాకృష్ణ కమిషన్ సిఫార్సుల అమలు చేయాలన్నారు. 2024 నుంచే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు, మహిళల రక్షణ, అభివద్ధికి కమిషన్. మద్యపానంపై నియంత్రణ, డ్రగ్స్ నిర్మూలన, పోలవరం నిర్వాసితులకు పునరావాసం, అటవీ సంరక్షణ చట్టసవరణ రద్దు చేయాలన్నారు. పోడు భూములకు పట్టాలు, ప్రత్యేక డిఎస్‌సి, ఏజెన్సీలో నాన్ షెడ్యూలు గిరిజన గ్రామాలు జిఓ 3 అమలు చేయాలనీ, సామాజిక న్యాయం ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, కులగణన, వివక్షపై కఠినచర్యలు, సబ్‌ప్లాను అమలు, దళితులకు రక్షణ, జస్టిస్ పున్నయ్య కమిటీ సిఫార్సుల అమలు, డప్పు, చర్మకారులందరికీ పెన్షన్లు. వెనుకబడిన ప్రాంతాలకు రూ.లక్ష కోట్లతో ప్యాకేజీ, నిర్ణీత కాలపరిమితిలో వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులు పూర్తి. నిర్వాసితుల పునరావాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ ప్రశాంగించారు. ఈ సమావేశం లో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జువ్వల.రాంబాబు, పి.తులసి, బి.రాజులోవ, ఎన్.రాజా, నాయకులు ఎస్.ఎస్.మూర్తి, సావిత్రి, కె.రామకష్ణ, జి.కృష్ణ, పాల్గొన్నారు