Oct 12,2023 00:10

రాష్ట్ర మహిళా సదస్సును జయప్రదం చేయండి

రాష్ట్ర మహిళా సదస్సును జయప్రదం చేయండి
సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పిలుపు
ప్రజాశక్తి- క్యాంపస్‌ : సంక్షేమ సాధికారత లక్ష్యంగా ప్రభుత్వ విధానాలు మారాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్‌ కమిటీ ఆధ్వర్యంలో తిరుపతిలో కొర్లగుంట జంక్షన్‌లో ఉన్న టిఎంఆర్‌ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతున్నది సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పిలుపు నిచ్చారు. దీనికి ముఖ్య అతిథిగా సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, దావాలే, డి.రమాదేవి, మూలం రమేష్‌, కే.సుబ్బారావుమ్మ, కే.ధనలక్ష్మి రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు హాజరు అవుతున్నారన్నారు. ఈ సదస్సుకు డాక్టర్‌ పి.సాయి లక్ష్మి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా సుందరయ్య నగర్‌ కమ్యూనిటీ హాల్‌ నందు పోస్టర్‌ ఆవిష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆకలి, అవిద్య, అసమానతలు, వేధింపులు, అత్యాచారాలు, ఉపాధి హామీ, ఉపాధి లేమి, ఘనమైన వేతనాలు పెరుగుతున్న భారాలు కష్టాలు కన్నీళ్ళకు అతిలేని వివరా నేపథ్యంలో జరుగుతున్న రాష్ట్ర సదస్సు దీన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మహిళలను హింసను పెట్రాగిచ్చే విధంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి పరిపాలన మద్యం పైన వచ్చే ఆదాయాన్ని ఏటేటా పెంచుకుంటూ మధ్యాహ్నం నిషేధించే దాన్ని నీరు చేర్చడం జరుగుతుందన్నారు. మద్యం వల్ల మత్తుమందులతో పోర్న్‌ సైట్స్‌ ప్రభావంతో మహిళల పైన నేరాలు సురీతంగా పెరిగిపోతున్నాయన్నారు. మహిళల సమానత్వ సాధన కోసం ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు రాష్ట్రంలో మహిళా ఉద్యమాలను సిపిఎం బలపరుస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవాలని డిమాండ్‌ చేస్తుందన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు డాక్టర్‌ పి. సాయిలక్ష్మి, ఎం.జయంతి, ఎస్‌.జయచంద్ర, బాలసుబ్రమణ్యం, మాధవ కష్ణ, నరేంద్ర, సోమశేఖర్‌, మల్లికార్జున, పి.హేమలత, తదితరులు పాల్గొన్నారు.