ప్రజాశక్తి-యస్.రాయవరం:వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 29వ మహాసభల పోస్టర్‌ను సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.సత్యనారాయణ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, భూమి పంచాలి, కూలి పెంచాలనే నినాదంతో జంగారెడ్డిగూడెంలో డిసెంబర్ 8, 9, 10 వ తేదీల్లో మహాసభలు జరుగుతాయని ఆయన తెలిపారు. 2004లో ప్రవేశపెట్టిన ఉపాధి హామీ చట్టాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగార్చడం శోచనీయమన్నారు. ఈ పధకానికి నిధులు తగ్గించడంతో ఉపాధి కూలీలు నష్ట పోతున్నారని ఆయన అన్నారు. 200 పని దినాలు కల్పించి రోజుకు రూ.600ల కూలీ ఇచ్చి ఉపాధి కూలిలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలో డిసెంబర్ 4 న జరిగే జిల్లా మహాసభలను ఉపాధి కూలీలు జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు, తదితరులు పాల్గొన్నారు










