Oct 22,2023 21:33

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో మూడో స్థానంలో నిలిచిన కర్నూల్‌ జట్టు

రాష్ట్ర ఖోఖో పోటీల్లో కర్నూలు జట్టుకు తృతీయ స్థానం
ప్రజాశక్తి - పగిడ్యాల

     రాష్ట్రస్థాయి బాలుర జూనియర్‌ ఖోఖో పోటీలలో ఉమ్మడి కర్నూలు జిల్లా జట్టు మూడవ స్థానంలో నిలిచింది. గత 15 రోజుల నుంచి పగిడ్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి జిల్లా ఖోఖో జట్టుకు ఉచిత శిక్షణ తీసుకున్నారు. ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు చిత్తూరు జిల్లా యాదమరిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో ఉమ్మడి కర్నూలు జిల్లా జట్టు పాల్గొంది. ఉమ్మడి కర్నూలు జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచినట్టు ఉమ్మడి కర్నూలు జిల్లా ఖోఖో చైర్మన్‌ పుల్యాల నాగిరెడ్డి తెలిపారు. జట్టు మూడో స్థానంలో నిలిచినందుకు జట్టును, కోచ్‌ను ఖోఖో చైర్మన్‌ పుల్యాల నాగిరెడ్డి, ఖోఖో ప్రెసిడెంట్‌ శంకర్‌, సెక్రెటరీ ప్రభాకర్‌, పగిడ్యాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మధుసూదన్‌ రావు, తోకల పితాంబరరెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.