ప్రజాశక్తి - కోసిగి
ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని, సైకో ప్రభుత్వాన్ని గద్దె దించాలని టిడిపి ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి కోరారు. గురువారం స్థానిక దుర్గ నగర్ 8వ వార్డులో 'బాబుతో నేను' నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి బాబు అక్రమ అరెస్టును నిరసించారు. మండల కన్వీనర్ జ్ఞానేష్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం తపించే చంద్రబాబుపై రాజకీయ కక్షతో అక్రమ కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర, నియోజకవర్గాన్ని అభివృద్ధి టిడిపితోనే సాధ్యమని తెలిపారు. టిడిపి మండల నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, కోడి పెద్ద ఈరన్న, కోడి ఉరుకుందప్ప, ఎస్.ఉరుకుందప్ప, కొండగేని వీరారెడ్డి, దుబ్బ వీరారెడ్డి, రంగడు, మహాదేవ, మారెప్ప, డీలర్ నరసన్న, బెళగల్ గోపాల్ పాల్గొన్నారు.
కోసిగిలో మాట్లాడుతున్న తిక్కారెడ్డి










