
ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్
ప్రజాశక్తి - పంగులూరు
చిద్రమైపోతున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును సరైన మార్గంలో పెట్టి, దిశా నిర్దేశం చేయగల నాయకుడు చంద్రబాబు ఒక్కరేనని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సైకో పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని అన్నారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మండలంలోని ఆరికట్లవారిపాలెంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలను కలిసి టిడిపి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక అమలు చేసే మినీ మేనిఫెస్టో వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా, ఆర్థికంగా పేదలను సుసంపనులను చేసేలా, అన్ని వర్గాల ప్రజలకు భరోసా కలిగిస్తూ ఆచరణాత్మకమైన పథకాలను చంద్రబాబు ప్రకటించినట్లు తెలిపారు. వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో రూ.40కోట్ల ఖర్చుపెట్టి జగన్ రెడ్డి రంగుల రంగుల పాంప్లెట్లకు ప్రజల సొమ్మును ఖర్చు పెడుతున్నాడని విమర్శించారు. మాస్కులు అడిగినందుకు డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపాడని అన్నారు. అనేక ఘటనల్లో దళితులపై దాడులు చేసినందుకు మళ్లీ జగన్‌ను గెలిపించాలా అని ప్రశ్నించారు. దళితుల సంక్షేమానికి అండగా ఉన్న 27దళిత సంక్షేమ పధకాలు రద్దు చేసినందుకు గెలిపంచాలా అని అన్నారు. రాబోయేది టిడిపి ప్రభుత్వం మేనని అన్నారు. తొలుత గ్రామంలో టిడిపి జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కర్రీ వెంకట సుబ్బారావు, టిడిపి మాజీ మండల అధ్యక్షులు కుక్క పల్లి ఏడుకొండలు, చింతల సహదేవుడు, గుర్రం ఆదిశేకర్, రమేష్ బాబు, మాజీ సర్పంచులు అమర్తపూడి ఏసోబు, ఉన్నం రవి, వలపర్ల సుబ్బారావు, దాసరి హనుమంతరావు గౌడ్, కోమటి ప్రసాద్, బెల్లంకొండ దశరథ, నార్ని శ్రీకాంత్, నార్ని శ్రీనివాసరావు పాల్గొన్నారు.