Oct 28,2023 21:16

నెల్లిమర్ల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామినాయుడు

ప్రజాశక్తి- గరివిడి : రానున్న ఎన్నికల్లో టిడిపిదే విజయమని టిడిపి విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం ఇంఛార్జి కిమిడి నాగార్జున అన్నారు. తప్పు చేయకపోయినా కేవలం వ్యక్తిగత కక్షతోనే చంద్రబాబును అరెస్టు చేసి, అక్రమంగా 50 రోజులుగా జైల్లో పెట్టారని విమర్శించారు. శనివారం చీపురుపల్లిలో 'బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పైల బలరాం, రౌతు కామునాయుడు, తిరుమలరాజు కిరణ్‌ కుమార్‌ రాజు, తాడ్డి సన్యాసి నాయుడు, సారేపాక సురేష్‌ బాబు, రెడ్డి గోవింద, యజ్జి పరపు సత్యం, ముల్లు రమణ, పెందుర్తి సింహాచలం, మహంతి అప్పలనాయుడు, మండల చంటి, పిళ్ళా అప్పలనాయుడు, శనపతి శ్రీనివాసరావు, అరతి సాహు, సబ్బి సోనియా తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల : టిడిపి బాబు షూరిటీ.. భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించి ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామినాయుడు, నియోజకవర్గం ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు సూచించారు. శనివారం నియోజక వర్గం కేంద్రంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం, భవిష్యత్‌ గ్యారంటీ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ బాబుతో భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమం నవంబరు 1 నుంచి పున్ణ ప్రారంభం చేస్తామని దీనిపై గ్రామాల్లో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టిడిపి నాయకులు మహంతి చిన్నంనాయుడు, కంది చంద్రశేఖర రావు, సువ్వాడ రవి శేఖర్‌, ఎల్‌.ఎల్‌ నాయుడు, పతివాడ తమ్మినాయుడు, ఆకిరి ప్రసాద్‌రావు, నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం టిడిపి మండల అధ్యక్షులు కడగల ఆనంద్‌ కుమార్‌, మహంతి శంకర్రావు, పల్లె భాస్కర్‌రావు, కర్రోతు సత్యనా రాయణ, గేదెల రాజారావు, పోతల రాజప్పన్న, అవనాపు సత్యనారాయణ, పాల్గొన్నారు. బాడంగి: చంద్రబాబు ఆరోగ్యంగా ఉండటంతో పాటు త్వరలో బయటకు రావాలని టిడిపి బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్‌ బేబీ నాయన అన్నారు. మండల కేంద్రంలో శనివారం నల్ల కండువాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం టిడిపి మద్దతుదారు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు మండల సర్వ సభ్య సమావేశాన్ని తిరస్కరించారు. జై చంద్రబాబు అనే నినాదాలతో ఎంపిడిఒ కార్యాలయం నుంచి టిడిపి బంగ్లా వరకు ర్యాలీ నిర్వహించిరు. ఈ సందర్భంగా బేబినాయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుకు నిరసనగ రాష్ట్రంలో టిడిపికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే వైసిపి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు తెంటు రవిబాబు, ఎంపిటిసిలు పాలవలస గౌరు, సింగిరెడ్డి భాస్కర్‌ రావు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. బొండపల్లి : 2024 ఎన్నికలలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ కెఎ నాయుడు అన్నారు. మండలంలోని గరుడబిల్లి జంక్షన్‌లో ఉన్న ఎస్‌ఎస్‌ఎన్‌ ఫంక్షన్‌ హాల్లో శనివారం నియోజకవర్గం విస్తృత స్తాయి సమావేశం నిర్వహించారు. కెఎ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బండారు బాలాజీ, పివివి గోపాలరాజు, కోరాడ కృష్ణ, అట్టాడ లక్ష్మునాయుడు, కొండపల్లి భాస్కర్‌ నాయుడు, పెద్దింటి మోహన్‌, పోలిపర్తి స్వామి నాయుడు, గంట్యాడ శ్రీదేవి, వేమలి చైతన్య బాబు, అల్లు విజరు కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. కొత్తవలస: స్థానిక టిడిపి మండల పార్టీ కార్యాలయంలో శనివారం టిడిపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు చౌదరి నారాయణ మూర్తి పాల్గొని మాట్లాడారు. సమావేశానికి ముందు కొత్తవలస పార్టీ కార్యాలయం నుంచి దేవితల్లి గుడి వరకు చంద్ర బాబునాయుడు అరెస్టును ఖండిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యని ర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్‌, ఎస్‌.కోట, ఎల్‌కోట టిడిపి మండల అధ్యక్షులు జి.ఎస్‌. నాయుడు, చొక్కాకుల మల్లునాయుడు, నాయకులు కోళ్ల శ్రీను, కరెడ్ల ఈశ్వరరావు, బండారు పెదబాబు, దాసరి లక్ష్మి, కొల్లి రమణ మూర్తి, రెడ్డి వెంకన్న, కొట్యాడ రమణ మూర్తి, కనకాల శివ తదితరులు పొల్గొన్నారు.విజయనగరం కోట : నవంబరు ఒకటో తేది నుంచి బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు పి.అశోక్‌గజపతిరాజు తెలిపారు. శనివారం స్థానిక అశోక్‌ బంగ్లాలో టిడిపి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశా నికి పార్టీ పరిశీలకులు ఆర్‌పి భంజ్‌దేవ్‌ హాజరయ్యారు. సమావేశంలో అశోక్‌ మాట్లాడుతూ 45 రోజుల పాటు 'బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్ర మంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించాలన్నారు.