ప్రజాశక్తి- నర్సీపట్నంటౌన్ :రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని వైసిపి జిల్లా అధ్యక్షులు, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ తెలిపారు. నర్సీపట్నంలో ఎమ్మెల్యే గణేష్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం గొలుగొండ, నర్సీపట్నం మండలాల గృహ సారధులు, వార్డు వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో ఇష్టా గోష్టి చర్చావేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై సమగ్రంగా వివరించాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని అధిష్టానం దృష్టికి తెలియజేయాలన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు అతని కుమారుడు లోకేష్ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రజలకు మంచి సేవలను అందించే ఉద్దేశంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి కన్వీనర్లను, గృహ సారధులను నియమించారని తెలిపారు. గృహ సారదులకు పార్టీ కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్పర్సన్ ఆదిలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
పేదలకు సంక్షేమ పథకాలు
కొత్తకోట:రావికమతం మండలం కొత్తకోటలో ఆదివారం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం రెండవ రోజుకు చేరుకుంది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో స్థానిక ఒకటవ సచివాలయం పరిధిలో రెండో రోజు కొనసాగింది. ఈ సందర్బంగా గ్రామంలో మూడు, నాలుగు వార్డులలో ఎమ్మెల్యే పర్యటన సాగింది. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పధకాలు అమలు పై అరా తీశారు. అర్హత కలిగిన పేదలకు పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.తనకు రేషన్ కార్డు తో పాటు సామాజిక పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని కోసిరెడ్డి రాజబాబు కోరగా, తమకు సామాజిక భవన నిర్మాణానికి నిధులు మంజూరు కు కషి చేయాలనీ స్థానిక నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ కలసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం జగనన్న ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పార్టీలకు, మతాలకు తావు లేకుండా ప్రభుత్వ పధకాలు అమలు చేసేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ డైరెక్టర్ జి.సత్యదేవ్, గ్రామ సర్పంచ్ కొన లోవరాజు, ఉపసర్పంచ్ పి.దేవ, ఎం పిటిసి సభ్యులు కె.లక్ష్మి శంకర్, పూడి దేవ, మాజీ ఉపసర్పంచ్ కె.గున్నాజీ, వైసీపీ జిల్లా కార్యదర్శి తలారి ఆదిమూర్తి, శీలం శంకరరావు పాల్గొన్నారు..










