May 08,2023 23:30

విద్యార్థులను అభినందిస్తున్న విద్యాశాఖాధికారులు

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌
రానున్న రోజుల్లో విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ అధిక ర్యాంకులు సాధించడం లక్ష్యంగా పనిచేయనున్నట్టు ఉదయ గోదావరి జిల్లాల ఆర్‌జెడి నాగమణి అన్నారు. పదో తరగతిలో జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన రెడ్డి హేమ సుందర వీరబాబు, వారి తల్లిదండ్రులను డిఇఒ అన్నపూర్ణ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంఇఒ వెంకటేశ్వరరావు, డిసిఇబి కార్యదర్శి వెంకట్రావువు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కాకినాడ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ప్రథమస్థానంలో నిలిచిన శ్రీనగర్‌ అడ్వాన్స్‌డ్‌ ఫౌండేషన్‌ కోర్సు విద్యార్థులను నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగ నరసింహారావు అభినం దించారు. సోమవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో తనను మర్యాద పూర్వకంగా కలిసిన పాఠశాల హెచ్‌ఎం ఎన్‌.నూకరాజు ఆధ్వర్యంలో విద్యార్థు లను ఎడిసి నాగనరసింహారావు అభినందించారు. హెచ్‌ఎం నూకరాజు మాట్లాడుతూ నగరంలోని 14 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అత్యధికంగా తమ పాఠశాలకు చెందిన 87శాతం మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. 79 మంది పరీక్షకు హాజరుకాగా 69 మంది ఉత్తీర్ణులయ్యారని, వీరిలో 23 మంది విద్యార్థులు 500లకు పైగా మార్కులు సాధించారని తెలిపారు.